ANDHRA PRADESH

దేశ సైనికుడి పై దాడి .. రెచ్చిపోతున్న లోకల్ మాఫియా

చిత్తూర్ జిల్లా కుప్పం మండల పరిథిలోని పెద్దబంగనాధం గ్రామంలో ఓ ఆర్మీ జవాన్ ఇంటి స్థలం లో ఇల్లు కడుతుండగా దౌర్జన్యంగా అతనిపై రాడ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. జవాన్ కుమ్మరేష్ తెలిపిన వివరాల మేరకు బంగనాథం గ్రామం లో సొంతంగా ఇల్లు నిర్మించుకుంటే రోడ్డుకు అడ్డంగా ఉందంటూ అదే గ్రామిని చెందిన బాలాజీ , కృష్ణ అనే ఇరువురు జవాన్ తల్లి , అన్న పై దాడి చేశారని తెలిపారు. ఎందుకు ఇలా చేస్తున్నావ్ అంటూ ప్రశ్నించిన జవాన్ పై సైతం దాడి చేశారని ఆర్మీ జవాన్ కుమ్మరేష్ ఆవేదన వ్యక్తం చేసాడు. జవాన్ కి తల కి తీవ్ర గాయమై 7 కుట్లు పడ్డట్టు సమాచారం. తన సొంత ఇంటి స్థలం లో ఇల్లు కట్టుకోవడానికి వీలు లేకుండా అదే గ్రామానికి చెందిన బాలాజీ, కృష్ణ అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ మీడియా ముఖంగా ప్రశ్నించారు . ఇంతేకాక స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా జవాన్ నైనా నాకే స్థానికంగా రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజలకు రక్షణ ఏముంటుందని ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తగు చెర్యలు తీసుకోవాలని బాధిత జావన్ కోరుతున్నాడు.