టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (TRAI) గత నెల టెలికం సంస్థల యొక్క 4G డేటా స్పీడ్ అనలిటిక్స్ ని విడుదల చేసింది. అయితే, మన దేశంలో అత్యధికమైన స్పీడ్ అందిస్తున్న టెలికం కూడా జియో నే అవుతుంది. ఎందుకంటే, బీహార్ లో ఇది 34.4 Mbps డౌన్లోడ్ స్పీడ్ తో అత్యంత వేగవంతమైన డేటా సర్వీస్ అంధిస్తున వాటిలో అగ్రస్థానములో ఉంటుంది. ఈ విభాగంలో, రాజస్థాన్ 25.7 Mbps డౌన్లోడ్ స్పీడ్ తో రెండవ స్థానములో ఉండగా, 23.9 Mbps స్పీడ్ తో మూడవ స్థానంలో ఉండగా, 23.1 Mbps డౌన్లోడ్ స్పీడ్ తో ఆంధ్రప్రదేశ్ మరియు పంజాబ్ వరుసగా నాల్గవ స్థానాల్లో ఉన్నాయి.ఈ నివేదిక ఆధారంగా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల్లో రిలయన్స్ జియో గరిష్టంగా 23.1 Mbps డౌన్లోడ్ స్పీడ్ తో వేగవంతమైన ఇంటర్నెట్ అందిస్తున్నవాటిలో మొదటి స్థానంలో నిలిచింది. రిలయన్స్ జియో తరువాత, 13.5 Mbps డౌన్లోడ్ స్పీడ్ తో ఎయిర్టెల్ రెండవ స్థానంలో నిలువగా, 3.4Mbps స్పీడ్ తో ఐడియా మూడవ స్థానంలో నిచ్చింది.ఇక డేటా అప్లోడ్ స్పీడ్ విషయానికి వస్తే, ఇందులో 6.6 Mbps డేటా అప్లోడ్ స్పీడ్ తో ఎయిర్టెల్ మొదటి స్థానంలో నిలిచింది. ఎయిర్టెల్ తరువాత, 4.9 Mbps డేటా అప్లోడ్ స్పీడ్ తో రిలయన్స్ జియో రెండవ స్థానములో నిలిచింది. ఇదే విభాగంలో, 2.8 Mbps అప్లోడ్ స్పీడ్ తో ఐడియా మూడవ స్థానములో ఉంది.