Sports

టోక్యో ఒలింపిక్స్: ఇండియా పురుషుల హాకీ జట్టుకు ఘోర పరాజయం

ఒలింపిక్స్ లో ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన భారత పురుషుల హాకీ జట్టు రెండో మ్యాచ్ లో ఘోర పరాజయం చవిచూసింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 1-7తో చిత్తుగా ఓడింది. మ్యాచ్ ప్రారంభం అయిందని రిఫరీ విజిల్ వేశాడో లేదో… నిమిషంలోపే గోల్ నమోదు చేసిన ఆస్ట్రేలియన్లు ఆ తర్వాత ఎక్కడా విశ్రమించలేదు. నిరంతరాయంగా భారత గోల్ పోస్టుపై దాడులు నిర్వహిస్తూ గోల్స్ వర్షం కురిపించారు. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై కోటగోడలా నిలిచిన భారత

Read more
BHAKTHI TELANGANA

రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు

తెలంగాణ రామప్ప గుడి అద్భుత శిల్ప కళా నైపుణ్యానికి ప్రతీక. తాజాగా రామప్ప గుడికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించినట్టు యునెస్కో ఓ ప్రకటనలో వెల్లడించింది. తద్వారా కాకతీయ రాజుల కాలం నాటి శిల్పకళా వైభవం ఖండాంతరాలు దాటింది. చైనాలో జరిగిన ఓ వర్చువల్ సమావేశంలో ప్రపంచ వారసత్వ కట్టడాల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన తొలి కట్టడం రామప్ప గుడి.

Read more
TELANGANA

కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపెట్ గ్రామంలో కోటివృక్షఅర్చనలో భాగంగా ఈరోజు సర్పంచ్ గంప మల్లీశ్వరి వెంకన్న ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాల అంగన్వాడి సెంటర్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రైతు వేదికల వద్ద 200 మొక్కలను గుంతలు తీసి మొక్కలు నాటడం జరిగింది మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా సర్పంచ్ గంప మల్లీశ్వరి వెంకన్న కేక్ కట్ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సర్పంచి గంప మల్లీశ్వరి వెంకన్న ఉప సర్పంచ్ బద్దం సంపత్

Read more
TELANGANA

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని అడ్డుకున్న రత్నతండా గ్రామస్థులు

జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రత్నతండా గ్రామస్థులు ఆయనను అడ్డుకున్నారు. తమ గ్రామానికి రోడ్డు వేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఎందుకు వేయలేదని గ్రామస్థులు ముత్తిరెడ్డిని నిలదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నర్మెట్ట మండలం మచ్చుపహాడ్ రిజర్వ్ ఫారెస్ట్ లో అటవీశాఖ ఆధ్వర్యంలో 10 మొక్కలను నాటే కార్యక్రమానికి ముత్తిరెడ్డి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగపేట గ్రామంలో రత్నతండాకు చెందిన ప్రజలు ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు.

Read more
AP NEWS

ఆంధ్రప్రదేశ్ లో 62 మంది జడ్జీలు బదిలీ

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 62 మంది జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉన్న జడ్జిలను ఇతర జిల్లాలకు, ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం జరిగింది. ఒకేసారి ఇంతమంది జడ్జిలను బదిలీ చేయడం విశేషం. బదిలీ అయిన వారంతా ఆగస్టు 3లోగా తమ కొత్త న్యాయస్థానాల్లో చేరాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఈలోపల పెండింగ్ కేసులను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మూడు రోజుల క్రితమే 68

Read more
Sports

ఒలింపిక్స్​ లో భారత్​ కు తొలి పతకం…. 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ లో మెడల్

ఒలింపిక్స్ లో భారత్ తొలి పతకాన్ని సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను రజత పతకాన్ని గెలిచింది. 49 కిలోల విభాగంలో ఆమె ఈ ఘనత సాధించింది. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ లలో కలిపి ఆమె 202 కిలోల బరువునెత్తింది. స్నాచ్ లో 87 కిలోలు (84, 87, 89), క్లీన్ అండ్ జెర్క్ లో 115 (110, 115, 117) కిలోలు ఎత్తింది. చైనాకు చెందిన హూ ఝూహీ 210 కిలోల (94,

Read more
TELANGANA

వివాహిత దారుణ హత్య … సంఘటన స్థలానికి చేరుకున్న సిపి కమలహాసన్ రెడ్డి

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మ్యాధర ప్రణాళిక (21) అనే వివాహిత యువతిని గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. హుజురాబాద్ కు చెందిన ప్రణాళిక బీటెక్ పూర్తి చేసి,రెండు నెలల క్రితమే బొమ్మనపల్లి గ్రామానికి చెందిన మ్యాధర అనిల్ (26) తో ప్రణాళికకు వివాహం జరిగింది. శుక్రవారం సాయంత్రం అత్తగారింట్లో ఒంటరిగా ఉన్న ప్రణాళికపై గుర్తుతెలియని దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

Read more
JOBS

ఏపీ హైకోర్టులో సివిల్‌ జడ్జి పోస్టులు

అమరావతిలోని హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ జడ్జి(జూనియర్‌ డివిజన్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. Jobsమొత్తం పోస్టుల సంఖ్య: 55 అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ(లా) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 01.07.2021 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతభత్యాలు: నెలకు రూ.27,700 నుంచి రూ.44,700 చెల్లిస్తారు. ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టñ స్ట్‌(కంప్యూటర్‌ బేస్డ్‌), రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్షా విధానం స్క్రీనింగ్‌ టెస్ట్‌: ఈ పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో మొత్తం 100 ప్రశ్నలు–100 మార్కులకు నిర్వహిస్తారు.

Read more
JOBS

టెరిటోరియల్‌ ఆర్మీలో ఆఫీసర్‌ పోస్టులు

న్యూఢిల్లీలోని టెరిటోరియల్‌ ఆర్మీ.. ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. Jobsఅర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. వయసు: 19.08.2021 నాటికి 18–42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు. పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌–1లో రీజనింగ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ నుంచి 100 ప్రశ్నలు, పేపర్‌–2లో జనరల్‌ నాలెడ్జ్,

Read more
WORLD

తాలిబన్లే లక్ష్యంగా అమెరికా విమాన దాడులు.. ప్రకటించిన పెంటగాన్

తాలిబన్ల దూకుడుతో దావాగ్నితో రగిలిపోతున్న ఆఫ్ఘనిస్థాన్ పై అమెరికా విమాన దాడులు చేసింది. ప్రస్తుతం తాలిబన్లతో పోరాడుతున్న ఆఫ్ఘన్ సైనిక బలగాలకు మద్దతుగా కొన్ని రోజుల నుంచి దాడులు చేస్తున్నట్టు పెంటగాన్ ప్రకటించింది. అయితే, ఆ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ‘‘ఆఫ్ఘన్ నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ కు మద్దతుగా కొన్ని రోజుల నుంచి అక్కడ మేం విమాన దాడులు చేస్తున్నాం. ప్రస్తుతానికి నేను చెప్పదలచుకున్నది ఇంతే. ఆ దాడులకు సంబంధించిన

Read more