BHAKTHI TELANGANA

రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు

తెలంగాణ రామప్ప గుడి అద్భుత శిల్ప కళా నైపుణ్యానికి ప్రతీక. తాజాగా రామప్ప గుడికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించినట్టు యునెస్కో ఓ ప్రకటనలో వెల్లడించింది. తద్వారా కాకతీయ రాజుల కాలం నాటి శిల్పకళా వైభవం ఖండాంతరాలు దాటింది. చైనాలో జరిగిన ఓ వర్చువల్ సమావేశంలో ప్రపంచ వారసత్వ కట్టడాల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన తొలి కట్టడం రామప్ప గుడి.

Read more
TELANGANA

కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపెట్ గ్రామంలో కోటివృక్షఅర్చనలో భాగంగా ఈరోజు సర్పంచ్ గంప మల్లీశ్వరి వెంకన్న ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాల అంగన్వాడి సెంటర్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రైతు వేదికల వద్ద 200 మొక్కలను గుంతలు తీసి మొక్కలు నాటడం జరిగింది మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా సర్పంచ్ గంప మల్లీశ్వరి వెంకన్న కేక్ కట్ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సర్పంచి గంప మల్లీశ్వరి వెంకన్న ఉప సర్పంచ్ బద్దం సంపత్

Read more
TELANGANA

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని అడ్డుకున్న రత్నతండా గ్రామస్థులు

జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రత్నతండా గ్రామస్థులు ఆయనను అడ్డుకున్నారు. తమ గ్రామానికి రోడ్డు వేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఎందుకు వేయలేదని గ్రామస్థులు ముత్తిరెడ్డిని నిలదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నర్మెట్ట మండలం మచ్చుపహాడ్ రిజర్వ్ ఫారెస్ట్ లో అటవీశాఖ ఆధ్వర్యంలో 10 మొక్కలను నాటే కార్యక్రమానికి ముత్తిరెడ్డి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగపేట గ్రామంలో రత్నతండాకు చెందిన ప్రజలు ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు.

Read more
TELANGANA

వివాహిత దారుణ హత్య … సంఘటన స్థలానికి చేరుకున్న సిపి కమలహాసన్ రెడ్డి

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మ్యాధర ప్రణాళిక (21) అనే వివాహిత యువతిని గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. హుజురాబాద్ కు చెందిన ప్రణాళిక బీటెక్ పూర్తి చేసి,రెండు నెలల క్రితమే బొమ్మనపల్లి గ్రామానికి చెందిన మ్యాధర అనిల్ (26) తో ప్రణాళికకు వివాహం జరిగింది. శుక్రవారం సాయంత్రం అత్తగారింట్లో ఒంటరిగా ఉన్న ప్రణాళికపై గుర్తుతెలియని దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

Read more
TELANGANA

నీటిని విడుదల చేసిన మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ జిల్లా ఎల్ఎండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కు వరద నీరు,మిడ్ మానేరు ద్వారా సుమారు లక్ష ముప్పై వేల క్యూసెక్కలు నీరు రావడంతో గురువారం సాయంత్రం మంత్రి గంగుల కమలాకర్ 12 గేట్లు ఎత్తి 60,000 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగింది.ఈ సంధర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రిజర్వాయర్లు నిండు కుండ కనపడుతున్నాయని, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే సాధ్యమైందని,రాష్ట్రంలో అండర్

Read more
TELANGANA

లయన్స్ క్లబ్ ఆఫ్ గన్నేరువరం ఆధ్వర్యంలో నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే …. వృద్ధులకు గొడుగులు పంపిణీ

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గన్నేరువరం నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే సందర్భంగా లయన్స్ సభ్యలు గొడుగులు పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో లయన్స్ క్లబ్, లియో సభ్యులు జోనల్ చైర్పర్సన్ లయన్ బూర శ్రీనివాస్, సెక్రెటరీ లయన్ తిప్పారం శ్రీనివాస్,లయన్ బూర రామకృష్ణ, లియో ప్రెసిడెంట్ గంట గౌతమ్, లియో శివ సాయి తదితరులు పాల్గొన్నారు

Read more
TELANGANA

బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ కె శశాంక కు ఆత్మీయ వీడ్కోలు

కరీంనగర్ క్లబ్ లో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కలెక్టర్ కే శశాంక ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కే శశాంక మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాతో తన అనుబంధం కుటుంబ అనుబంధం లాంటిదని అన్నారు. అధికారులు. ప్రజా ప్రతినిధులు సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు. పరిపాలనలో అడుగులు వేసింది, రాటుదేలినది కరీంనగర్ జిల్లాలోనే అని అన్నారు. కరీంనగర్ జిల్లాలో పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు

Read more
TELANGANA

మూడు రోజులుగా కురిసిన వర్షాలకు గన్నేరువరం మండలంలో రాకపోకలు బంద్

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జంగపల్లి – హన్మజీపల్లి మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కుంటలు చెరువులు నిండుకుండలా మారాయి దీంతో మండలంలో ప్రధాన రహదారి వద్ద కల్వర్టు వద్ద వాహనాలకు రాకపోకలు బంద్ కావడంతో వాహనదారులు ప్రయాణికులు వెనుదిరిగారు ఇప్పటివరకు వర్షపాతం 3.70 మీ.లీ నమోదయింది

Read more
TELANGANA

ఎమ్మెల్యే రసమయి ను మర్యాద పూర్వకంగా కలిసిన యువ నాయకులు తోట కొటేశ్వర్

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం : రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ గా మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ మూడో సారి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈ రోజు అయన నివాసంలో టీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు తోట కోటేశ్వర్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శ్రీ వేంకటేశ్వర స్వామి జ్ఞాపిక తీర్థ ప్రసాదాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు

Read more
TELANGANA

ఏసీబీ వలలో కాటారం తహశీల్దార్ సునీత..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం తహశీల్దార్ సునీతను 2లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కొత్తపల్లికి చెందిన ఐత హరికృష్ణ కొత్తపల్లి శివారులోని సర్వే నెంబరు 3 లో భూమికి ఆన్లైన్ చేసి పట్టా పాస్ బుక్కుల కోసం 3 లక్షలు డిమాండ్ చేయగా 2 లక్షలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది..

Read more