BHAKTHI TELANGANA

రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు

తెలంగాణ రామప్ప గుడి అద్భుత శిల్ప కళా నైపుణ్యానికి ప్రతీక. తాజాగా రామప్ప గుడికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించినట్టు యునెస్కో ఓ ప్రకటనలో వెల్లడించింది. తద్వారా కాకతీయ రాజుల కాలం నాటి శిల్పకళా వైభవం ఖండాంతరాలు దాటింది. చైనాలో జరిగిన ఓ వర్చువల్ సమావేశంలో ప్రపంచ వారసత్వ కట్టడాల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన తొలి కట్టడం రామప్ప గుడి.

Read more
BHAKTHI

నరసింహస్వామి జయంతి రోజు పూజా విశిష్టత

శ్రీ మహా విష్ణువు ధరించిన దశావతారాలలో నరసింహ స్వామి అవతారం మరింత ప్రత్యేకతను .. విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. దశావతారాలలో నాల్గొవది నరసింహస్వామి అవతారం. ప్రహ్లాదుడిని రక్షించడం కోసం .. లోక కల్యాణం కోసం .. హిరణ్యకశిపుడిని సంహరించడం కోసం నరసింహ స్వామి వైశాఖ శుక్ల చతుర్దశి రోజున ఆవిర్భవించాడు. దుష్ట శిక్షణ చేసి ధర్మానిదే విజయమనే విషయాన్ని స్పష్టం చేశాడు. హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం స్వామి మహర్షుల అభ్యర్థన మేరకు అనేక ప్రదేశాల్లో లక్ష్మీ

Read more
BHAKTHI

కణ్వపురం క్షేత్రం ప్రత్యేకత

ప్రాచీన క్షేత్రాలు అనేక విశేషాల సమాహారంగా కనిపిస్తాయి. ఎన్నో మహిమలకి నెలవుగా అనిపిస్తాయి. అలాంటి దివ్య క్షేత్రాల్లో ‘తిరుక్కణ్ణ పురం’ ఒకటిగా కనిపిస్తుంది. ‘కణ్వపురం’ అనే పేరుతో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. తిరువారూరు సమీపంలో గల ఈ క్షేత్రం, పంచ కృష్ణారణ్యాలలో ఒకటిగా పేర్కొంటారు. ఇక్కడి స్వామివారు శౌరిరాజ పెరుమాళ్ పేరుతోనూ .. అమ్మవారు కన్నపుర నాయకి పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు. ఇక్కడి స్వామివారిని కులశేఖరాళ్వార్ .. నమ్మాళ్వార్ .. పెరియాళ్వార్ .. ఆండాళ్ ..

Read more
BHAKTHI TELANGANA

తెలంగాణలో బోనాలు – మంగ్లీ పాటపై విమర్శలు

జానపద గీతాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ గాయని మంగ్లీ వివాదంలో చిక్కుకుంది. తెలంగాణలో ఆషాఢం బోనాల సీజన్ సందర్భంగా ఆమె పాడిన పాటపై విమర్శలు వస్తున్నాయి. ఆ పాటకు రామస్వామి సాహిత్యం అందించగా, రాకేశ్ వెంకటాపురం సంగీతం అందించారు. అయితే, ఆ భక్తి గీతంలోని కొన్ని పదాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మవారిని దూషిస్తున్నట్టుగా కొన్ని పదాలు ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం వంటి బోనాలను కించపరిచేలా ఈ పాట ఉందని,

Read more
AP NEWS BHAKTHI TELANGANA

విజయవాడకు తెలంగాణ బృందం – తరలివెళ్లిన బోనాలు

తెలంగాణ గత ఆదివారం నుంచి బోనాలు షురూ అయిన సంగతి తెలిసిందే. జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పణతో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. కాగా, ప్రతి ఏడాది ఆనవాయితీ ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి బోనం తరలివచ్చింది. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ నేతృత్వంలో దుర్గమ్మ తల్లి కోసం హైదరాబాద్ నుంచి బోనం తీసుకవచ్చారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారికి భక్తిప్రపత్తులతో బోనం సమర్పించారు. కాగా, తెలంగాణ నుంచి వచ్చి బోనాల బృందానికి దుర్గ గుడి పాలకమండలి చైర్మన్ సోమినాయుడు,

Read more
BHAKTHI

వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ

శ్రీమహావిష్ణువు ఆవిర్భవించిన 108 దివ్య తిరుపతులు ఎంతో మహిమాన్వితమైనవిగా ప్రసిద్ధి చెందాయి. ఎంతో విశిష్టతను సంతరించుకున్న ఈ క్షేత్రాలలో ఒకటిగా ‘నిచుళాపురి’ దర్శనమిస్తుంది. ‘తిరుచ్చి’ సమీపంలో వెలుగొందుతున్న ఈ క్షేత్రంలో స్వామివారు అళగియ మనవాళ పెరుమాళ్ పేరుతోనూ .. అమ్మవారు వాసలక్ష్మీ పేరుతో పూజలు అందుకుంటున్నారు. ఇక్కడి ‘కల్యాణ తీర్థం’ పరమ పవిత్రమైనదిగా చెబుతారు. పూర్వం ధర్మవర్మ అనే రాజుకు స్వామివారు దర్శనం ఇచ్చినట్టుగా స్థలపురాణం చెబుతోంది. ధర్మవర్మ తన భార్య నిచుళాదేవి పేరుతో ఈ ఊరును

Read more