TELANGANA

మట్కా జూదరుల అరెస్ట్

రీంనగర్ టాస్క్ ఫోర్స్ మరీయూ స్పెషల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఐదుగురు మట్కా జూదరుల అరెస్ట్, పరారీలో నలుగురు, 5,500/-డబ్బులు లభ్యం… పట్టుబడ్డ నిందితులపైనా టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కరీంనగర్ కమిషనరేట్ లో గత కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న మట్కా ఆటను టాస్క్ ఫోర్స్, కరీంనగర్ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ లు పట్టుకోవడం జరిగింది. కరీంనగర్ పట్టణంలో వీరు గత కొన్ని రోజులుగా ఎవరికీ అనుమానం రాకుండా రహస్య ప్రదేశంలో

Read more
TELANGANA

అమరులైన వాన్లకు ఎక్స్ గ్రేషియా ఇంకా ఇవ్వలే… కేసీఆర్ పై ప్రవీణ్ ఫైర్

ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. గత జూన్ లో గాల్వాన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో అమరులైన తెలంగాణ జవాన్లందరికీ రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించిందని … అయితే ఇప్పటి వరకు ఒక్క కల్నర్ సంతోష్ కుమార్ కుటుంబానికి తప్ప మిగిలిన 19 కుటుంబాలకు సాయం అందలేదని చెప్పారు. ఎక్స్ గ్రేషియా ప్రకటించి 17 నెలలు కావస్తున్నా

Read more
WORLD

చైనా లో యువతకు శాపంగా మారిన ప్రభుత్వ విధానాలు….పెరిగిపోతున్న ‘బ్యాచిలర్స్’

చైనా లో పెళ్లి మాట ఎత్తితేనే యువకులు భయపడిపోతున్నారు. ఫలితంగా ముదురు బెండకాయల్లా మిగిలిపోతున్నారు. జీవన వ్యయం పెరిగిపోతుండడం, తగినంతమంది అమ్మాయిలు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోంది. దీనికితోడు దశాబ్దాలుగా చైనా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు కూడా నేటి యువతకు శాపంగా పరిణమించాయి. ఇప్పుడు తేరుకుని నష్టనివారణ చర్యలు ప్రారంభించినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. యువత క్రమంగా కనుమరుగవుతుండగా, వృద్ధుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. చైనాలో ఏడాదికేడాదికి పెళ్లిళ్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ‘చైనా

Read more
Politics

కుటుంబ పార్టీలతో ప్రజాస్వామ్యానికే ముప్పు: ప్రధాని మోడీ

దేశం లో కుటుంబ పార్టీలు, వారసత్వ రాజకీయాలతో దేశం సంక్షోభం దిశగా పయనిస్తోందని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలనుకునేవారికి అది ఓ పెద్ద ఆందోళనగా పరిణమించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, బీజేపీ ఎంపీలు హాజరుకాగా కాంగ్రెస్ సహా 14 విపక్షాలు దూరంగా ఉన్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశమయ్యాయి. అయితే, కాంగ్రెస్ సహా వివిధ పార్టీలనుద్దేశించి ‘కుటుంబ

Read more
AP NEWS

దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి జగన్ … ఎపి సియం పై హర్ష కుమార్ తీవ్ర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు. పేదలకు ఇస్తున్న పెన్షన్లకు కూడా కులాన్ని ఆపాదించే దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి జగన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్క దళితుడికైనా వైసీపీ ప్రభుత్వం రుణం ఇచ్చిందా? అని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని హక్కుల అమలు కోసం పోరాడాల్సిన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. అన్ని శాఖలకు తానే మంత్రి అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రులు బయటకొస్తే జనాలు చితకబాదే సమయం ఆసన్నమైందని చెప్పారు. రాజమండ్రిలో మీడియాతో

Read more
National

దేశంలో తగ్గుతున్న జనాభా… మంచిది కాదంటున్న నిపుణులు

భారత జనాభా తగ్గుతోంది. మునుపటితో పోలిస్తే పుడుతున్న పిల్లల సంఖ్య తగ్గిపోయింది. ‘రీప్లేస్ మెంట్ స్థాయి (జనాభా అటు తగ్గకుండా.. ఇటు పెరగకుండా ఉండే స్థిర స్థాయి)’ కన్నా తక్కువగా సంతాన రేటు నమోదవుతోంది. 2019–21 మధ్య నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే – 5 (ఎన్హెచ్ఎఫ్ఎస్–5)లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రెండు దఫాలుగా ఈ సర్వే చేయగా.. గత ఏడాది డిసెంబర్ లోనే మొదటి దశ సర్వే ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా

Read more
AP NEWS

జూనియర్ ఎన్టీఆర్ చెబితే మేమెందుకు వింటాం ! : కొడాలి నాని

శవాల మీద చిల్లర ఏరుకునే నాయకుడు చంద్రబాబు అని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఆయన భార్య పేరును వాడుకుంటే నందమూరి కుటుంబం మద్దతిస్తుందనే చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. వర్ల రామయ్య కామెంట్లపై ఆయన స్పందించారు. అసెంబ్లీలోగానీ, బయటగానీ ఆమె పేరును తాము ప్రస్తావించలేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబు తన భార్యను తానే అల్లరి చేసుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను అనని మాటలకు తానెందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. జూనియర్

Read more
AP NEWS

ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ బిల్లును ప్రవేశపెట్టిన పేర్ని నాని

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ బిల్లును రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సవరణ బిల్లు తీరుతెన్నులను వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకే షోలు ప్రదర్శించాల్సి ఉంటుందని, టికెట్ల ధరలు కూడా ప్రభుత్వ నియమనిబంధనలకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. సినిమా టికెట్లను ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చని వెల్లడించారు. ఇప్పటివరకు ఉన్న పరిస్థితుల్లో మార్పు తీసుకువస్తామని అన్నారు. రోజుకు 4 షోలు వేయాల్సిన

Read more
AP NEWS

బంగాళాఖాతంలో అల్పపీడనం – ఎపి లో డిసెంబర్ 4 వరకు వర్షాలు

బంగాళాఖాతం అల్పపీడన పరిస్థితులు, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 27 నుంచి డిసెంబరు 4వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, అదే సమయంలో రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అనంతపురం, కర్నూలు, విజయనగరం, ఉభయగోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో

Read more