TELANGANA

గన్నేరువరం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా గంప వెంకన్న

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపెట్ గ్రామానికి చెందిన గంప వెంకన్న టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షునిగా నియామకం అయ్యారు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులుగా గంప వెంకన్న ను నియమిస్తూ గురువారం రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ నియామక పత్రాన్ని అందజేశారు అనంతరం ఎమ్మెల్యే నాయకులు కలిసి నూతన ఎన్నికైన మండల అధ్యక్షుడు గంప వెంకన్నకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు ఈకార్యక్రమంలో గన్నేరువరం జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి జువ్వాడి మన్మోహన్ రావు, టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు తీగల మోహన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు,కరీంనగర్ జిల్లా యూత్ నాయకులు తోట కోటేశ్వర్, టిఆర్ఎస్ పార్టీ మానకొండూరు నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు గూడూరి సురేష్, తదితరులు పాల్గొన్నారు.