Politics

మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ

నెల్లూరు కార్పొరేషన్ సహా 13 మున్సిపాలిటీలు, కొన్ని నగర పంచాయతీలు, మరో 10 మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఈరోజు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయని చెప్పారు. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచిందని అన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్లు, సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.