National

నాయకుడు అంటే ఇలా ఉండాలి !

ముఖ్యమంత్రి పర్యటనకి వస్తున్నారు అంటే అయన వెళ్లే మార్గంలో ఉన్న వ్యాపార సంస్థలు, దుకాణాలు మూసి వేయిస్తారు పోలీసులు.

ఇక ట్రాఫిక్ నియంత్రణ పేరుతో గంటలకొద్ది ట్రాఫిక్ స్థంబింప చేసి ప్రజలకు పట్ట పగలే నక్షత్రాలు చూపిస్తారు.

కేరళ ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది లేకుండా ఒక ఆటోలో వెళ్లి ఒక కాకా హోటల్లో చక్కగా తృప్తిగా భోజనం చేసి (సొంత డబ్బులు ఇచ్చి ) వెళ్లిపోయారు.

పదవి ఇచ్చింది ప్రజల సేవ చేయటానికి అని నమ్మే నాయకులు క్రమంగా కనుమరుగు అవుతున్నారు.

పదవిని హోదాగా భావించి ప్రజా ధనాన్ని విచ్చల విడిగా ఖర్చు పెట్టటం ఫ్యాషన్ గా మారిన ఈ రోజుల్లో సామాన్య వ్యక్తిగా ఉండటం హర్షించదగ్గ విషయం… ఎందరికో ఆదర్శప్రాయం.