TELANGANA

ఘనంగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అసెంబ్లీ అధ్యక్షులు సంగుపట్ల మల్లేశం మాట్లాడుతూ డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా వదులుకొని బహుజన బతుకులు మారాలంటే రాజ్యాధికారమే ముఖ్యమని గమనించి బహుజనుల బతుకులు మార్చడం కోసం దేశంలో పోరాడుతున్న పార్టీ బీఎస్పీ తోనే సాధ్యమని గ్రహించి పార్టీలో చేరిన నాటి నుండి నిర్విరామంగా కృషి చేస్తున్న ప్రవీణ్ కు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరు అడుగుజాడల్లో నడవాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కో కన్వీనర్ ప్రమీల మరియు మండల కన్వీనర్ అమ్మిగల్ల సుధాకర్ మరియు మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్ళుపెళ్లి భూమయ్య గన్నేరువరం సెక్టర్ ప్రధాన కార్యదర్శి ఎల్లయ్య, పల్లె బాబు, నగునూరి అనిల్, తిమ్మాపూర్ మండల కన్వీనర్ అభిలాష్, హన్మాజిపల్లి సెక్టార్ ప్రధాన కార్యదర్శి అల్వల్ల ప్రదీప్, పైస రాజు బీఎస్పీ నాయకులు సతీష్, మల్లేశం బీఎస్పీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.