TELANGANA

ఐకేపి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సిపిఐ నాయకులు

కరీంనగర్ జిల్లా గన్నెరువరం మండల కేంద్రంలోని ఐకేపి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సిపిఐ బృందం సందర్శించి రైతులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తేలుసుకొని ఈ సందర్బంగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ బోయిని అశోక్ మాట్లాడుతూ అకాల వర్షలా వల్ల రైతులకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. కొనుగోలు లో జాప్యం లేకుండా మరింత వేగవంతం చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.అలాగే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని కాలం వెళ్ళబుచుకుంటున్నారు. రైతుల పరిస్థితులును పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఏది ఏమైనా తడిసిన దన్యన్ని కూడా కొనుగోలు చెయ్యాలి గన్ని సంచులు కొరత లేకుండా చూడాలి అధికారులు రైతులకు అందుబాటులో ఉండి కొనుగోలు చేయాలన్నారు. ఈకార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కాంతల అంజిరెడ్డి, సిపిఐ మండల సహాయ కార్యదర్శి చొక్కాల శ్రీశైలం, మోలుగురి సంపత్ కాంతల మహేందర్ రెడ్డి, గడీల బాలయ్య,కొనగల అంజయ్య బోయిని మల్లయ్య, కుమ్మరి కనకయ్య ,గూడూరి రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.