TELANGANA

గల్ఫ్ దేశాలలో మరణించిన కుటుంబానికి … ఆర్థిక సహాయం చేసిన GWAC

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం:ఉప్పు గడ్డ వీధి మమిండ్ల రాజు అనే వ్యక్తి కి ఈరోజు GWAC రాజన్న సిరిసిల్ల జిల్లా జంగిడి మధు బిజిలీ దేవయ్య రవి కటుకం, ఎండి లాలా బాయ్, శ్రీనివాస్ ఆ కుటుంబానికి భరోసానిస్తూ 5000 రూపాయలు అందజేయడం జరిగింది.గల్ఫ్ దేశాలలో మరణించిన తెలంగాణ గల్ఫ్ కార్మికుల మృతదేహాలు ఇంటికి చేరాలంటే నెలల తరబడి సమయం పడుతుంది. తెలంగాణ ప్రభుత్వం చనిపోయినటువంటి గల్ఫ్ కార్మికుల మృతదేహాలను వారంరోజుల్లో తెప్పించే ప్రయత్నం చేపట్టాలని, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ ఎన్నారై పాలసీ ప్రకటించి గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల మృతు ధనసహాయం అందించాలని. GWAC రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి డిమాండ్ చేస్తున్నారు.