TELANGANA

ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించిన జడ్పీటీసీ సభ్యులు

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ సందర్శించి, కోవిడ్ టీకా కార్యక్రమము, ఆసుపత్రి సిబ్బంది పనితీరును ఆరా తీశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వం కరోనా వ్యాప్తిని నివారించుటకు ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం, కోవిడ్ టెస్టుల నిర్వహణ చేపడుతోంది. ప్రజలు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుత వర్షాకాల పరిస్థితుల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది ప్రజలు జాగ్రత్త పడేట్లు చూడాలి మరియు ముందుస్తూ తగు జాగ్రత్తలు చేపట్టాలి. ఇంటింటి జ్వర సర్వేతో పాటు వాఁటర్ ట్యాన్క్ ల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలి. మండలానికి నలుగురు కమ్మునిటీ హెల్త్ ఆఫీసర్లను సబ్ సెంటర్లకు కేటాయించగా త్వరలోనే వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్, జిల్లా సర్విల్ ఆఫీసర్ డా.వై.నాగ శేఖర్, పి.హెచ్.సి. డాక్టర్ మమ్లిక, వార్డు సభ్యులు మ్యాకల సంపత్, పెసరు శ్రీనివాస్, సీ.ఎచ్.ఓ మహమ్మద్ రఫిక్, సూపర్వైజర్ ఆజిబాబా, ఏ.ఎన్.ఎం స్వరూప, అరిగెల రమేష్ తో పాటు వైద్య సిబ్బంది ఉన్నారు