AP NEWS

శ్రీ నేతి వేంకటేశ్వర స్వామి తిరునాళ్ళ మహోత్సవంలో పాల్గొన్న నరసరావుపేట శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి

గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నేతి వేంకటేశ్వర స్వామి తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా.. గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ..టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి , సత్తెనపల్లి ఎమ్మెల్యే శ్రీ అంబటి రాంబాబు , పెద్దకూరపాడు ఎమ్మెల్యే శ్రీ నంబూరి శంకర్ రావు , ఎంపి శ్రీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు , రాజ్యసభ సభ్యులు శ్రీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి స్వామి వారిని […]

WORLD

చైనా సైనిక సంపత్తి సాయం కోరిన రష్యా… భారత్ కు ఆందోళన!

భావజాల దేశాలు రష్యా, చైనా మిత్రులన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఉక్రెయిన్ పై దండయాత్రకు తెగించిన రష్యా తాజాగా మిత్రదేశం చైనా సాయం కోరింది. ఉక్రెయిన్ లో దాడులు ముమ్మరం చేసేందుకు వీలుగా సైనిక సామగ్రి అందజేయాలని విజ్ఞప్తి చేసింది. ఉక్రెయిన్ పై దాడి రష్యాకు సునాయాసం అని భావించినా, ఉక్రెయిన్ ప్రతిఘటన అసామాన్యంగా ఉంది. రష్యా వైపు భారీగా సైనికులు హతం కాగా, పెద్ద సంఖ్యలో యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లు, శతఘ్నులు ధ్వంసమైనట్టు వార్తలు వస్తున్నాయి. […]

JOBS

రాష్ట్ర సాగునీటి శాఖలో 700 పోస్టులు

 రాష్ట్ర సాగునీటి శాఖ పరిధిలో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండొద్దని, వెంటనే పోస్టులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు మొదలయ్యాయి. తొలి విడతలో 700 పోస్టులు భర్తీ చేసేందుకు శాఖ సిద్ధమవుతోంది. వాటిలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఏఈఈ) పోస్టులు 568, అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఏఈ) పోస్టులు 132 ఉండనున్నాయి. వీటి భర్తీకి సంబంధించిన ఫైలు ఇప్పటికే ప్రభుత్వానికి చేరగా, త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

JOBS

ఎక్లాట్‌ మరో 1,400 మంది ఉద్యోగులను నియమించేందుకు సన్నాహాలు

ఆరోగ్య, రక్షణ రంగంలో సాంకేతిక, సేవల రంగంలో పేరొందిన వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేసే ఎక్లాట్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌ (ఎక్లాట్‌) తెలంగాణలో తన గ్లోబల్‌ డెలివరీ సెంటర్‌ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్‌లో వచ్చే 18 నెలల కాలంలో మరో 1,400 మంది ఉద్యోగులను నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ఎక్లాట్‌ ఇప్పటికే కరీంనగర్‌లో నిర్వహిస్తున్న కార్యకలాపాలను విస్తరించడంతో పాటు వరంగల్, ఖమ్మంలో రెండు కొత్త డెలివరీ సెంటర్ల […]

NATIONAL

‘బ్రహ్మోస్’ పరీక్ష విజయవంతం…భారత్-రష్యా సహకారంతో అభివృద్ధి

రక్షణ రంగంలో రోజురోజుకు బలోపేతం అవుతున్న భారత్ అమ్ములపొదిలోకి మరో అత్యాధునిక క్షిపణి వచ్చిచేరింది. సముద్రతలంపై ఆధిపత్యం సాధించే ఉద్దేశంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘బ్రహ్మోస్’ సుదీర్ఘ శ్రేణి క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఈ మేరకు భారత నావికాదళం ప్రకటించింది. యుద్ధ నౌక నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి పూర్తి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు తెలిపింది. ఇప్పటి వరకు వీటికి భూ, గగనతల పరీక్షలు నిర్వహించగా, తొలిసారి యుద్ధనౌక నుంచి ప్రయోగించారు. ధ్వని వేగాన్ని మించి […]

AP NEWS

ఎపి లో నిర్మలా సీతారామన్ పర్యటన… ప్రోటోకాల్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వైసీపీ ఎంపీలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీలోని అనంతపురం జిల్లాలో పర్యటించారు. పాలసముద్రం గ్రామంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ మరియు నార్కొటిక్స్ (నాసిన్) అకాడమీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, ఈ కార్యక్రమం ప్రోటోకాల్ పై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు ఆయన ఫిర్యాదు చేశారు. నాసిన్ అకాడమీ శంకుస్థాపన కార్యక్రమం ఆహ్వాన జాబితాలో తన పేరు […]

WORLD

ఉక్రెయిన్ పై కాల్పులను విరమించుకుంటున్న రష్యా

ఉక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించుకునేందుకు వడివడిగా ముందుకు సాగుతున్న రష్యా దళాలు.. కాసేపు కాల్పుల విరమణను ప్రకటించాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మానవతా దృక్పథంతో రష్యా కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలు) కొన్ని గంటలు మరిపోల్, వొల్నోవఖాల్లో కాల్పులు జరపబోమని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. అయితే, కీవ్, చెర్నిహివ్, సూమీల్లో మాత్రం ఎయిర్ రైడ్స్ తో విరుచుకుపడుతోంది. తాజాగా కూడా ఎయిర్ రైడ్స్ సైరన్స్ […]

POLITICS

వేరే పార్టీతో టచ్ లో ఉన్న వైసిపి ఎంపీలు , ఎమ్మెల్యేలు : సినీ నటుడు శివాజీ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మందడంలో రైతుల దీక్షా శిబిరం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా టాలీవుడ్ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు మరో పార్టీతో టచ్ లో ఉన్నారని, వారంతా పక్క చూపులు చూస్తున్నారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు దారుణమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ మూడు […]