ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మరోమారు ఫైరయ్యారు. వైసీపీలోని కొందరు నేతలు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఇటీవల వ్యాఖ్యానించిన బాలినేని తాజాగా వారికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాను తింటున్నది కూడా ఉప్పూ కారమేనని, ఇకపై వారు పద్ధతి మార్చుకోకుంటే కాళ్లు విరగ్గొడతానని హెచ్చరించారు. నిన్న జరిగిన ఒంగోలు పార్టీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రతిపక్షానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జనార్దన్, మునిసిపల్ మాజీ […]
ANDHRA PRADESH
సీఎం జగన్, శ్రీలక్ష్మిలపై ఛార్జ్ షీట్లు ఉన్నాయి : ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
మరోసారి తనని సస్పెండ్ చేయడంపై ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మండిపడ్డారు. తనపై ఒక్క ఛార్జ్ షీట్ కూడా లేదని ఆయన అన్నారు. తన సంతకాలను ఫోర్జరీ చేశారని… దీనిపై సీఎస్ కు మూడు సార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మీద 12 సీబీఐ కేసులు, 6 ఈడీ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఉన్నాయని… ఐఏఎస్ శ్రీలక్ష్మిపై కేసులు, ఛార్జ్ షీట్లు ఉన్నాయని… వీరికి వర్తించనివి తనకెలా […]
ఆంధ్రప్రదేశ్ లో 60 మంది మావోయిస్టుల లొంగుబాటు .. కిడారి, సోమ హత్య కేసు నిందితులు కూడా ఉన్నట్టు సమాచారం
ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అల్లూరి జిల్లాలో పోలీసుల ఎదుట 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 27 మంది మిలీషియా సభ్యులు కాగా.. మరో ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు. లొంగిపోయిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సోమ హత్య కేసు నిందితులు కూడా ఉన్నట్టు సమాచారం. కోరుకొండ, పెదబయలు దళాలకు చెందిన మావోలు లొంగిపోయారు. ఇంత పెద్ద సంఖ్యలో మావోలు లొంగిపోవడం గత పదేళ్ల కాలంలో ఇదే తొలిసారి. మరోవైపు […]
ధర్మవరంలో ప్రెస్ మీట్ జరుగుతుండగా బీజేపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా, కర్రలు, రాడ్లతో వచ్చిన వ్యక్తులు తీవ్రస్థాయిలో దాడికి పాల్పడడం తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. బీజేపీ నేతలపై నేడు ధర్మవరం ప్రెస్ క్లబ్ లో దాడి జరిగిందని తెలిపారు. పట్టపగలు… పాత్రికేయుల సమావేశం జరుగుతుండగా వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. కాగా, ఈ దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని […]
సొంత పార్టీ వాళ్లే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు : వైసీపీ కీలక నేత బాలినేని
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీలో కీలక నేత, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమీప బంధువుగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై సొంత పార్టీ వాళ్లే కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అలా సొంత పార్టీలో ఉంటూనే తనపై కుట్రలు చేస్తున్న వారెవరో తనకు తెలుసునని చెప్పిన […]
ప్రజా వేదిక వద్ద నిరసనకు టీడీపీ వ్యూహం… చంద్రబాబు ఇంటి వద్ద హైటెన్షన్
టీడీపీ హయాంలో కృష్ణా కరకట్టపై నాటి సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంటి సమీపంలో నిర్మించిన ప్రజా వేదికను వైసీపీ ప్రభుత్వం కూల్చివేసి నేటితో సరిగ్గా మూడేళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో ప్రజా ధనంతో కట్టిన ప్రజా వేదికను కూల్చివేసిన జగన్ సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు ప్రజా వేదిక వద్ద నిరసనలకు సిద్ధమయ్యాయి. ఇందుకోసం గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకుంటున్నాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ప్రజా వేదిక కూల్చివేత […]
నారా లోకేష్ పరామర్శ యాత్రను జయప్రదం చేయాలని కోరిన యరపతినేని శ్రీనివాసరావు
పిడుగురాళ్ల: ఇటీవల హత్య గావించబడిన బీసీ నాయకుడు కంచేటి జల్లయ్య గారి కుటుంబాన్ని పరామర్శించడానికి పిడుగురాళ్ల మీదుగా కారంపూడి మీదుగా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం, రావులాపురం గ్రామానికి విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి ఘన స్వాగతం పలకాలని గురజాల నియోజవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చిన గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారు. ఇటీవల కాలంలో మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గట్టి […]
ఏరువాక పున్నమి కార్యక్రమంలో.. కొత్త లుక్ లో కన్పించిన పల్నాడు జిల్లా కలెక్టర్ ‘శివశంకర్’
పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ళ మండలం చాగంటి వారి పాలెం గ్రామంలో ఏర్పాటుచేసిన ఏరువాక పున్నమి కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ కొత్త లుక్ లో కనిపించారు. తలకు కండువా, పంచె కట్టుకొని చూపరులను ఆకర్శించారు. గోధుమ రంగు పట్టు పంచె లో ఆయన ‘పల్నాడు బ్రహ్మనాయుడు’ లా కన్పించారు. ఆయనలో తెలుగుదనం, పల్లె సంప్రదాయాలు స్పష్టంగా కన్పించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి […]
“గడపగడపకు”లో రచ్చ… జనంపై బూతు పురాణం అందుకున్న వైసీపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీ చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో జనం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ పాలుపంచుకున్న గడపగడపకులో ఆయనను జనం నిలదీశారు. తమకు అమ్మ ఒడి రావడం లేదని పలువురు ఆయనకు విన్నవించగా… వారిపై ఆయన చిందులేసిన వైనం వైరల్‌గా మారిపోయింది. ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ హాజరైన గడపగడపకు కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం […]
ఉద్యోగుల బదిలీలకు ఎపి సియం జగన్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాధారణ ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రతిపాదిత ఫైల్‌పై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతకం చేశారు. ఈ క్రమంలో బదిలీల్లో ఉద్యోగుల అర్హత, ఖాళీల వివరాలు తదితర నిబంధనలతో రేపు లేదంటే ఎల్లుండి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే… ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేసిన సమయంలో అధికార యంత్రాంగానికి సీఎం జగన్ పలు సూచనలు […]