CINEMA

చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ టైటిల్ సాంగ్ విడుదల

చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం అక్టోబరు 5న దసరా కానుకవగా రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో, ఈ సినిమా టైటిల్ సాంగ్ ను చిత్రబృందం నేడు విడుదల చేసింది. ఈ పాటకు తమన్ బాణీలు అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘తార్ మార్ తక్కర్ మార్’, ‘నజభజ జజర’ పాటలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు టైటిల్ సాంగ్ కూడా రావడంతో సోషల్ మీడియాలో మెగా అభిమానుల సందడి అంతాఇంతా […]

ANDHRA PRADESH CINEMA

సీనియర్ నటుడు కృష్ణంరాజు కన్నుమూత

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు, రెబల్‌స్టార్ కృష్ణంరాజు ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు 20 జనవరి 1940లో జన్మించారు. చదువు పూర్తయిన తర్వాత కొన్నాళ్లపాటు జర్నలిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత సినీ రంగంలో అడుగుపెట్టారు. 1966లో వచ్చిన ‘చిలకా గోరింక’ ఆయన తొలి సినిమా. హీరోగా […]

CINEMA

నందమూరి కుటుంబం నుంచి వస్తున్న మరో హీరో.. కథ రెడీ చేస్తున్న దర్శకుడు!

నందమూరి కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రముఖ నటుడు బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ త్వరలోనే టాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నట్టు సమాచారం. టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఆయన కథ కూడా సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇదే నిజమైతే బాలయ్య అభిమానులకు పండుగే. కాగా, ఎన్‌బీకే 107 షూటింగ్ సెట్‌లో ఇటీవల మోక్షజ్ఞ బర్త్ డే వేడుకలు నిర్వహించడం […]

CINEMA

అన్నయ్య తప్ప.. ఈ పాత్రని ఇంకెవ్వరూ చేయలేరు

అభిమానులే మా ఆస్తిపాస్తులు. వాళ్ల ఆనందం కోసమే సినిమాలు చేస్తుంటాం’’ అన్నారు ఎన్టీఆర్‌. కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటించిన ‘బింబిసార’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘రెండున్నరేళ్ల క్రితం కల్యాణ్‌ అన్న ఫోన్‌ చేసి ‘చాలా ఆసక్తికరమైన కథ విన్నా. నువ్వు  కూడా వింటే బాగుంటుంది అని చెప్పాడు. అలా ‘బింబిసార’ కథ నేను విన్నాను. ఎంత కసిగా ఆ కథ చెప్పాడో.. […]

CINEMA TELANGANA

ఓటీటీ రిలీజ్‌పై తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌ ప్రకటన

రూ.6 కోట్ల లోపు సినిమాల‌న్నీ లోబ‌డ్జెట్ సినిమాలు రూ.6 కోట్లు మించిన‌వ‌న్నీ భారీ బ‌డ్జెట్ సినిమాలే సినిమా టికెట్ల ధ‌ర‌ల‌నూ నిర్ణ‌యించిన ఫిలిం చాంబ‌ర్‌ తెలుగు సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యాక ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చే విష‌యంపై తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌ సోమ‌వారం ఓ స్ప‌ష్ట‌మైన విధానాన్ని ప్ర‌కటించింది. ఈ మేర‌కు సోమ‌వారం హైద‌రాబాద్‌లో భేటీ అయిన ఫిలిం చాంబ‌ర్‌ కొత్త విధానాన్ని ప్ర‌క‌టించింది. అన్నిర‌కాల సినిమాల‌కు ఈ విషయంలో ఒకే త‌ర‌హా […]

CINEMA TELANGANA

తెలుగు సినిమా షూటింగ్ లు బంద్ …

బాలీవుడ్ ను షేక్ చేస్తూ దూసుకెళ్తున్న టాలీవుడ్ కు షాకింగ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్ లు నిలిచిపోనున్నాయి. వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగుతుండటంతో బుధవారం నుంచి టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు పూర్తిగా నిలిచిపోనున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన సినీ కార్మికులు వేతనాలు పెంచాలంటూ సమ్మెకు నోటీసులు ఇచ్చారు. ఇన్ని రోజుల వరకు వేతనాలు పెంచకుండా ఉన్నందుకు రేపటి నుండి సమ్మెలోకి వెళ్లాలని సినిమా కార్మికులు నిర్ణయించారు. వేతనాలు […]

CINEMA

‘బ్రహ్మాస్త్ర’కు చిరంజీవి వాయిస్ ఓవర్ … చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపిన నాగార్జున

బాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ బ్రహ్మాస్త్రలో టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున కూడా నటించడం తెలిసిందే. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ చిత్రం తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో వస్తోంది. తొలి భాగాన్ని ‘బ్రహ్మాస్త్రం మొదటి భాగం: శివ’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి తన గొంతు అరువిచ్చారు. ఈ సినిమా కోసం ఆయన వాయిస్ ఓవర్ అందించారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ, చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. “డియర్ చిరంజీవి…. మీరెప్పుడూ ఓ మంచి […]

CINEMA NATIONAL

స్టార్ హీరో సూర్య‌పై కేసు న‌మోదు

త‌మిళ స్టార్ హీరో, ఆస్కార్ గ‌డ‌ప దాకా వెళ్లి వ‌చ్చిన జై భీమ్ సినిమాలో ప్ర‌ధాన భూమిక పోషించిన న‌టుడు సూర్య‌పై త‌మిళ‌నాడు పోలీసులు కేసు న‌మోదు చేశారు. క‌రోనా నేప‌థ్యంలో నేరుగా ఓటీటీలోనే విడుద‌లైనా కూడా ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను ఏ మేర సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ సినిమాను సూర్య భార్య జ్యోతిక నిర్మించ‌గా.. టీజే జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గిరిజ‌నుల‌పై అగ్ర‌కులాల ఆధిప‌త్యం, అందుకు ప్ర‌భుత్వ యంత్రాంగం, ప్ర‌త్యేకించి […]

CINEMA

అవ‌కాశాలు రాన‌ప్పుడు వేరే ఉద్యోగం చూసుకుంటాను : హీరో సిద్ధార్థ్‌

సరైన పాత్రల్లో నటించే అవకాశం వచ్చినంతవరకూ తాను సినిమాల్లో నటిస్తానని, ఒక వేళ అటువంటి అవకాశాలు రానప్పుడు వేరే ఉద్యోగం వెతుక్కుంటానన‌ని సినీ హీరో సిద్ధార్థ్ చెప్పాడు. నటుడిగా నా కెరీర్‌ ప్రారంభమైనప్ప‌టి నుంచి తాను అధికంగా దక్షిణాది చిత్రాల్లోనే నటించానని ఆయ‌న చెప్పాడు. దీంతో చాలామంది తాను ఢిల్లీకి చెందిన వ్య‌క్తిన‌న్న విష‌యాన్ని కూడా మర్చిపోయారని ఆయ‌న తెలిపాడు. తాను హిందీ చాలా బాగా మాట్లాడతానని, ఆసక్తికరమైన పాత్రలు వచ్చినప్పు హిందీ సినిమాల్లో నటిస్తుండటం ఒక […]

CINEMA

సినీ తార కరాటే కళ్యాణి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది.. డబ్బులు ఇవ్వలేదనే కొట్టింది..

యూట్యూబ్ లో అశ్లీల కంటెంట్ తో ప్రాంక్ వీడియోలు చేసే శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిపై గురువారం రాత్రి ప్రముఖ సినీ నటి కరాటే కళ్యాణి దాడి చేసింది. గురువారం రాత్రి హైదరాబాద్ యూసుఫ్ గూడ బస్తీలో శ్రీకాంత్ ని సినీనటి కరాటే కల్యాణితో పాటు మరి కొంతమంది కలిసి చితకబాదారు. ప్రాంక్ పేరుతో మహిళలపై ఇష్టం వచ్చినట్లు శ్రీకాంత్ చేతులు వేస్తున్నాడు, ప్రాంక్ పేరుతో అమ్మాయిలను ఫ్లర్టింగ్ చేసి మహిళల గౌరవాన్ని దెబ్బతిస్తున్నాడు, ఒంటరిగా వెళ్తున్న […]