సింగరేణి లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో ఖాళీగా 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్2 పోస్టులను భర్తీ చేస్తామని సంస్థ ప్రకటించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 10 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ఉద్యోగాలకు డిగ్రీ చేసినవారు అర్హులు. డిగ్రీలో కంప్యూటర్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. లేదంటే డిగ్రీతో పాటు కంప్యూటర్స్ లో ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సు/ డిప్లొమా చేయాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లకు మించకూడదు. ఈ ఉద్యోగాలను […]
JOBS
తగ్గేదిలేదు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే .. త్వరలోనే అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ ఉంటుందని ప్రకటన!
త్రివిధ దళాల్లో రిక్రూట్ మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నపథ్ పథకం దేశ వ్యాప్తంగా పలు చోట్ల హింసను రాజేసింది. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులు పలు చోట్ల నిరసన కార్యక్రమాలను చేపట్టారు. రైళ్లకు నిప్పుపెడుతున్నారు. సికింద్రాబాద్ లో సైతం ఒక రైలును అగ్నికి ఆహుతి చేశారు. అయినప్పటికీ కేంద్రం కానీ, ఆర్మీ కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఈ రోజు కీలక […]
తెలంగాణలో మరో కొలువుల నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు వెలువడగా… తాజాగా బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో వైద్యుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 1,326 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. తాజా నోటిఫికేషన్లో భర్తీ కానున్న పోస్టుల వివరాల్లోకి వెళితే… అసిస్టెంట్ సివిల్ సర్జన్ పోస్టులు 751, ట్యూటర్ పోస్టులు 357, అసిస్టెంట్ సివిల్ సర్జన్ జనరల్ పోస్టులు 211, […]
రాష్ట్ర సాగునీటి శాఖలో 700 పోస్టులు
రాష్ట్ర సాగునీటి శాఖ పరిధిలో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండొద్దని, వెంటనే పోస్టులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు మొదలయ్యాయి. తొలి విడతలో 700 పోస్టులు భర్తీ చేసేందుకు శాఖ సిద్ధమవుతోంది. వాటిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ) పోస్టులు 568, అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టులు 132 ఉండనున్నాయి. వీటి భర్తీకి సంబంధించిన ఫైలు ఇప్పటికే ప్రభుత్వానికి చేరగా, త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఎక్లాట్ మరో 1,400 మంది ఉద్యోగులను నియమించేందుకు సన్నాహాలు
ఆరోగ్య, రక్షణ రంగంలో సాంకేతిక, సేవల రంగంలో పేరొందిన వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ (ఎక్లాట్) తెలంగాణలో తన గ్లోబల్ డెలివరీ సెంటర్ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్‌లో వచ్చే 18 నెలల కాలంలో మరో 1,400 మంది ఉద్యోగులను నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ఎక్లాట్ ఇప్పటికే కరీంనగర్లో నిర్వహిస్తున్న కార్యకలాపాలను విస్తరించడంతో పాటు వరంగల్, ఖమ్మంలో రెండు కొత్త డెలివరీ సెంటర్ల […]
డబ్బింగ్ , సౌండ్ ఇంజనీరింగ్ , వీడియో ఎడిటింగ్ నేర్పించబడును
డబ్బింగ్, సౌండ్ ఇంజినీరింగ్, ఆడియో, వీడియో ఎడిటింగ్ తక్కువ ఫీజుతో నేర్పించి అవకాశాలు ఇప్పించబడును. డబ్బింగ్ కళాకారులకు యూనియన్ కార్డు ఉచితం. Contact : 9704024519 , 7780260559
యూపీఎస్సీ–కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2021
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. 838 పోస్టుల భర్తీకి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్–2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. ► కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2021 ► మొత్తం పోస్టుల సంఖ్య: 838 పోస్టుల వివరాలు ► కేటగిరీ–1: సెంట్రల్ హెల్త్ సర్వీస్‌లో జూనియర్ స్కేల్ పోస్టులు– 349. ► కేటగిరీ–2: రైల్వేలో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్–300. –న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్–05. –జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్2 […]
ఇంటర్ అర్హతతోనే ఉద్యోగం- శిక్షణ సమయంలో నెలకు రూ.56వేలకు పైగా స్టయిఫెండ్
ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకొని.. ఉన్నత కొలువుతోపాటు చదువు కూడా కొనసాగించాలనుకునే వారికి చక్కటి అవకాశం.. యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్ఏ ఎగ్జామినేషన్! ఈ పరీక్షలో ప్రతిభ చూపితే త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకు హోదాతో ఉన్నత ఉద్యోగం లభిస్తుంది! 21 లేదా 22ఏళ్ల వయసులోనే.. త్రివిధ దళాల్లో అడుగుపెట్టి.. ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవచ్చు!! శిక్షణ సమయంలోనే నెలకు రూ.56వేలకుపైగా అందుకోవచ్చు. తాజాగా ఎన్డీఏ,ఎన్ఏ(2)–2021కు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియెట్ అర్హతతోనే ఈ పరీక్షకు […]
సీఆర్పీఎఫ్ లో ఉద్యోగవకాశాలు
న్యూఢిల్లీలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)కు చెందిన స్పోర్ట్స్ బ్రాంచ్ ట్రెయినింగ్ డైరెక్టరేట్.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 06 పోస్టుల వివరాలు: ఫిజియోథెరపిస్ట్–05, న్యూట్రిషనిస్ట్–01. ఫిజియోథెరపిస్ట్: అర్హత: ఫిజియోథెరపీలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 40ఏళ్లు మించకుండా ఉండాలి. వేతనం నెలకు రూ.50,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు. న్యూట్రిషనిస్ట్: అర్హత: న్యూట్రిషన్లో ఎమ్మెస్సీ కోర్సు/న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్‌లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 50ఏళ్లు […]
డీఎస్ఎస్ఎస్బీలో 5807 టీజీటీ ఉద్యోగావకాశాలు
నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(ఎన్సీటీ ఢిల్లీ)ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్(డీఎస్ఎస్ఎస్బీ)..అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 5807 సబ్జెక్టులు: బెంగాలీ, ఇంగ్లిష్, ఉర్దూ, సంస్కృతం, పంజాబీ. అర్హత: మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజస్(ఎంఐఎల్)లో ఏదో ఒక సబ్జెక్టులో బీఏ(ఆనర్స్), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్‌లో డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. హిందీలో మంచి […]