అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే ఉపాధ్యాయులు చెంప దెబ్బకొడుతుంటారు. కానీ, తాను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని ఓ ఎమ్మెల్యే.. కళాశాల ప్రిన్సిపాల్‌ను కొట్టి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని మాండ్యలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ణాటక మాండ్య నియోజకవర్గ ఎమ్మెల్యే, జేడీఎస్ పార్టీకి చెందిన ఎం.శ్రీనివాస్ మాండ్యలోని నల్వాడి కృష్ణ రాజా వడయార్ ఐటీఐ కళాశాలను ఈనెల 20న సందర్శించారు. నైపుణ్య అభివృద్ధి […]
NATIONAL
పోలీసుపై ఉమ్మేసిన మహిళా కాంగ్రెస్ నాయకురాలు … వీడియో చూడండి
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్న తీరుకు నిరసనగా ఆ పార్టీ శ్రేణులు కొనసాగిస్తున్న ఆందోళనల్లో మంగళవారం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నిరసనల్లో పాలుపంచుకుంటున్న తమను నిలువరించే యత్నం చేస్తున్న పోలీసులపై మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా ఏకంగా ఉమ్మేసి కలకలం రేపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. మంగళవారం ఐదో రోజు రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరైన సంగతి […]
నక్సల్స్ దాడి … ముగ్గురు సీఆర్పీఎఫ్ జవానులు మృతి
మావోయిస్టులు అదను చూసి భద్రతాబలగాలను దెబ్బకొట్టారు. ఒడిశా నౌపడా ప్రాంతంలోని పటధారా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఓ క్యాంపు నుంచి మరో క్యాంపునకు వెళుతున్న సీఆర్పీఎఫ్ బలగాలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మరణించారు. మరో ఏడుగురు జవాన్లకు గాయాలయ్యాయి. మరణించినవారిని ఏఎస్ఐ శిశుపాల్ సింగ్, సిబ్లాల్, ధర్మేంద్ర కుమార్ సింగ్ గా గుర్తించారు. ఈ కాల్పుల ఘటనతో పటధారా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించారు. ప్రస్తుతం అక్కడ మావోయిస్టుల కోసం […]
అగ్ని వీరులకు 12వ తరగతి సర్టిఫికెట్ జారీ చేస్తాం : అనిల్ పురి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం ద్వారా త్రివిధ దళాలకు ఎంపికయ్యే వారిలో 60 నుంచి 70 శాతం మంది పదో తరగతి వారే ఉంటారని సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి తెలిపారు. వారి కాల పరిమితి ముగిసి బయటకు వచ్చే నాటికి వారి వయసు 21 నుంచి 25 ఏళ్ల లోపు ఉంటుందన్నారు. వారికి 12వ తరగతి సర్టిఫికెట్ జారీ చేస్తామని, ఆ తర్వాత వారు డిగ్రీ పూర్తి […]
అగ్నిపథ్ కు వ్యతిరేకంగా భారత్ బంద్…. 529రైళ్ళు రద్దు
అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్రం డిఫెన్స్ రిక్రూట్మెంట్ స్కీమ్ కి వ్యతిరేకంగా నిరసన బృందాలు సోమవారం నాడు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు హర్యానా, జార్ఖండ్, పంజాబ్, కేరళ రాష్ట్రాలు భద్రతను పెంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అగ్నిపథ్ డిఫెన్స్ రిక్రూట్మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల కారణంగా చెలరేగిన విధ్వంసంతో రైల్వే కార్యకలాపాలు దెబ్బతినడంతో సోమవారం 500 రైళ్లకు పైగా రద్దు చేయబడ్డాయి. […]
తగ్గేదిలేదు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే .. త్వరలోనే అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ ఉంటుందని ప్రకటన!
త్రివిధ దళాల్లో రిక్రూట్ మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నపథ్ పథకం దేశ వ్యాప్తంగా పలు చోట్ల హింసను రాజేసింది. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులు పలు చోట్ల నిరసన కార్యక్రమాలను చేపట్టారు. రైళ్లకు నిప్పుపెడుతున్నారు. సికింద్రాబాద్ లో సైతం ఒక రైలును అగ్నికి ఆహుతి చేశారు. అయినప్పటికీ కేంద్రం కానీ, ఆర్మీ కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఈ రోజు కీలక […]
మోదీని టార్గెట్ చేసిన శ్రీలంక అధికారులు .. మోడీ .. ఎందుకు స్పందించడం లేదు?: కేటీఆర్
శ్రీలంక 500 మెగావాట్ల విండ్ పవర్ ప్లాంట్ ను ఎలాంటి పోటీ లేకుండానే అదానీ దక్కించుకున్నారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును అదానీ గ్రూప్ కు కట్టబెట్టాలని శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై భారత ప్రధాని మోదీ ఒత్తిడి తీసుకొచ్చారని ఆ దేశ విద్యుత్తు సంస్థ అధ్యక్షుడిగా పని చేసిన ఎంఎంసీ ఫెర్డినాండో ఇటీవల వెల్లడించారు. ఈ అంశం శ్రీలంకలో పెను దుమారమే లేపింది. అదానీ గ్రూప్ కు వ్యతిరేకంగా అక్కడ నిరసన కార్యక్రమాలు […]
ఉత్తరప్రదేశ్ అక్రమ కట్టడాల కూల్చివేతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ సర్కారు అక్రమ కట్టడాల కూల్చివేతలో అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు గురువారం వాదనలు జరిగాయి. కట్టడాల కూల్చివేతలకు ముందు నిర్ణీత విధానాన్ని అనుసరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతా చట్టబద్ధంగానే జరగాలని పేర్కొంది. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ యూపీలోని ప్రయాగ్ రాజ్, కాన్పూర్ లో అల్లర్లు చోటు చేసుకోవడం తెలిసిందే. ప్రయాగ్ రాజ్ అల్లర్ల వెనుక ప్రధాన సూత్రధారి ఇంటికి అక్కడి మున్సిపల్ యంత్రాంగం నోటీసు […]
తొలి రోజే రాష్ట్రపతి ఎన్నికకు 11 నామినేషన్లు .. ఒకటి మాత్రం రిజెక్ట్ !
ఇండియన్ ప్రెసిడెంట్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన బుధవారమే ఏకంగా ఆ ఎన్నికకు 11 నామినేషన్లు దాఖలయ్యాయి. జూలై 23తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం ముగియనుంది. ఈ లోగా కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికలకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికకు 11 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రపతి ఎన్నికలకు పార్లమెంటు సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ పోలింగ్ నిర్వహిస్తున్నా… నామినేషన్ల దాఖలు […]
దీదీ భేటీకి 8 మంది సీఎంలను పిలిస్తే ఒక్కరూ రాలేదు … !
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలిపే దిశగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తలపెట్టిన కీలక భేటీ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రారంభమైంది. ఈ భేటీకి రావాలంటూ దీదీ ఏకంగా 22 మంది జాతీయ స్థాయి నేతలకు ఆహ్వానం పంపారు. అయితే కాసేపటి క్రితం మొదలైన ఈ భేటీకి చాలా తక్కువ మందే హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ భేటీకి […]