ANDHRA PRADESH ENGLISH NEWS NATIONAL POLITICS TELANGANA

SC forming panel to examine issue of freebies by political parties is ‘burial by committee’: Experts – ప్రతి ఒక్కరు చదవండి పదిమంది షేర్ చేయండి

పన్ను చెల్లింపుదారుల ఆల్ ఇండియా ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిన్న నిర్ణయించింది, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అవుతుంది. ఏ ప్రభుత్వం పాలించినా, ఈ సంస్థ ఆమోదం లేకుండా, ఉచిత విద్యుత్, ఉచిత నీరు, ఉచిత పంపిణీ లేదా రుణమాఫీలను ఏ ప్రభుత్వమూ ప్రకటించలేము. డబ్బు మా పన్ను చెల్లింపులకు చెందినది కాబట్టి, దాని వినియోగాన్ని పర్యవేక్షించే హక్కు పన్ను చెల్లింపుదారులకు ఉండాలి. రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఉచితాలను […]

ANDHRA PRADESH POLITICS

బీఆర్ఎస్సే కాదు… ఏ పార్టీ వ‌చ్చినా వైసీపీని ఏమీ చేయ‌లేవు: ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి ర‌మేశ్

టి ఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై ప‌లు పార్టీల‌కు చెందిన నేత‌లు వ‌రుస‌గా స్పందిస్తున్నారు. తాజాగా ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీకి చెందిన కీల‌క నేత‌, ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేశ్ స్పందించారు. ఏపీలో బీఆర్ఎస్ ప్ర‌భావ‌మేమీ ఉండ‌ద‌ని ఆయ‌న అన్నారు. దేశంలో చాలా మంది పార్టీలు పెట్టుకుంటూ ఉంటార‌ని, వారి ఆలోచ‌న‌ల‌ను బ‌ట్టి ఆయా పార్టీల నిర్ణ‌యాలు ఉంటాయ‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. వైసీపీకి […]

POLITICS TELANGANA

కేసీఆర్ జాతీయ పార్టీ ఆవిర్భావం .. సంబ‌రాల్లో మునిగిన పార్టీ శ్రేణులు

తెలంగాణ రాష్ట్ర స‌మితి.. భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్ ఎస్‌)గా మారింది. ఈ మేర‌కు సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న బుధ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన టీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఏక‌వ‌చన తీర్మానాన్ని ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ప్ర‌వేశపెట్టారు. దీనికి స‌ర్వ‌స‌భ్య స‌మావేశానికి హాజ‌రైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం, మ‌ధ్యాహ్నం 1.19 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ […]

ANDHRA PRADESH POLITICS

ఆంధ్రప్రదేశ్ మంత్రుల మానసిక ఆరోగ్యంపై అనుమానాలు కలుగుతున్నాయి: విష్ణువర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీ మంత్రులపై ధ్వజమెత్తారు. ఏపీ మంత్రులు బజారు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని, వారి భాష అసభ్యకరంగా ఉందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది అభ్యంతరకరమని అన్నారు. ఇలాంటివాళ్లను మంత్రులుగా చేసిన జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని ఊళ్లమీదికి వదిలినట్టుందని విమర్శించారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే సంక్షేమ పథకాలు తొలగిస్తామని డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడడం సిగ్గుచేటని, అవసరమైతే ఓటర్ల కాళ్లు పట్టుకుంటామని మరో మంత్రి సీదిరి అప్పలరాజు అంటున్నాడని వెల్లడించారు. […]

POLITICS

అక్రమ నిర్మాణాలు @ అమీన్ పూర్ – నో పర్మిషన్ … నో యాక్షన్

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ లో మున్సిపల్ కమిషనర్ సుజాత అవినీతి అక్రమాలకు తెగబడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాసులకు కక్కుర్తిపడి విధి , విధానాలను తాకట్టు పెడుతోంది. నకిలీ పత్రాలు సృష్టించి, అక్రమ వెంచర్లు వేస్తున్న ” ఎ ఆర్ ” డెవలపర్స్ కు వంత పాడుతూ … ఇటు ప్రభుత్వాన్ని అటు ప్రజలను నిండా ముంచుతోంది. సర్వే నంబర్ 1003, 1004, 1057,1060, 1062, 1063 లలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. నిర్మాణాలకు […]

POLITICS TELANGANA

కొన్ని ఉన్మాద శక్తులు కుట్రలు చేస్తున్నాయి .. మేధావులు మౌనంగా ఉండకూడదు: సీఎం కేసీఆర్​

దేశంలో ఇప్పటికీ పేదల ఆశలు నెరవేరని పరిస్థితులు ఉన్నాయని.. అట్టడుగు వర్గాల ప్రజల్లో ఆక్రోశం వినిపిస్తూనే ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అనేక వర్గాల ప్రజలు తమకు స్వాతంత్ర్యం ఫలాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వారి బాధను పక్కన పెట్టేసి.. దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇదంతా తెలిసి కూడా ఏమీ అర్థంకానట్టు ప్రవర్తించడం, మౌనంగా ఉండటం మేధావుల లక్షణం కాదని చెప్పారు. సోమవారం హైదరాబాద్ లోని […]

POLITICS TELANGANA

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత హస్తం ఉందన్న బీజేపీ .. పరువు నష్టం దావా వేయనున్న కవిత

దేశ రాజధాని ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధం ఉందంటూ ఆరోపించిన బీజేపీ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాలపై పరువు నష్టం దావా వేయనున్నట్టు తెలుస్తోంది. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆమె న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ ఆరోపణలపై ఈరోజు ఆమె […]

ANDHRA PRADESH POLITICS

‘జగన్ రోడ్లు- నరకానికి దారులు’.. సోష‌ల్ మీడియా వేదికగా బిజెపి ప్ర‌చారం

ఆంధ్రప్రదేశ్ ర‌హ‌దారుల దుస్థితిపై ఇప్ప‌టికే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీతో పాటు జ‌న‌సేన కూడా వినూత్న నిర‌స‌న‌ల‌కు దిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రారంభ‌మైన జ‌న‌సేన ప్ర‌చారం ఇంకా కొన‌సాగుతుండ‌గా… ఏపీలో ఆ పార్టీతో పొత్తులో కొనసాగుతున్న బీజేపీ కూడా తాజాగా రోడ్ల దుస్థితిపై ప్ర‌చారం మొద‌లుపెట్టింది. జ‌న‌సేన మాదిరే కార్టూన్ల‌తో బీజేపీ త‌న ప్ర‌చారానికి శ్రీకారం చుట్టింది. శుక్ర‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా బీజేపీ ఓ సెటైరిక‌ల్ కార్టూన్‌ను సంధించింది. ‘జగన్ రోడ్లు- నరకానికి దారులు’ పేరిట […]

NATIONAL POLITICS TELANGANA

ఓడీఎఫ్‌లో తెలంగాణ నంబర్ వన్ ..

పారిశ్రామికంగానే కాకుండా, త‌ల‌స‌రి ఆదాయం, ప‌న్నుల రాబ‌డి, జీడీపీ త‌దిత‌ర అంశాల్లో దేశంలోనే అగ్ర‌గామి రాష్ట్రంగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న తెలంగాణ తాజాగా మ‌రో కీల‌కమైన అంశంలో టాప్ లేపింది. బ‌హిరంగ మ‌ల విస‌ర్జ‌న నిర్మూల‌న (ఓడీఎఫ్‌)లో తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఉత్త‌మ ఫ‌లితాలు సాధించి అగ్ర స్థానంలో నిలిచింది. ఈ మేర‌కు శుక్ర‌వారం కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఓడీఎఫ్ ర్యాంకుల్లో 99.98 శాతంతో ఈ జాబితాలో తెలంగాణ‌ అగ్ర‌స్థానంలో […]

NATIONAL POLITICS

భార్యలు ఎన్నికల్లో గెలిస్తే, భర్తలు ప్రమాణస్వీకారం !

మధ్యప్రదేశ్ లోని దమోహ్ జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇక్కడి గైసాబాద్ గ్రామ పంచాయతీకి ఇటీవల ఎన్నికలు జరిగాయి. షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఓ మహిళ సర్పంచ్ గా నెగ్గగా, మరికొందరు మహిళలు కూడా వార్డు మెంబర్లుగా గెలిచారు. అయితే ప్రమాణ స్వీకారం రోజున ఆశ్చర్యకర దృశ్యాలు కనిపించాయి. గెలిచిన మహిళల్లో ఒక్కరూ పంచాయతీ పరిసరాల్లో కనిపించకపోగా, వారి తరఫున భర్తలు ప్రమాణస్వీకారం చేస్తూ దర్శనమిచ్చారు. దీనిపై జిల్లా కలెక్టరేట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి నివేదిక […]