కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు బుధవారం భేటీ అయ్యారు. జీఎస్డీ కౌన్సిల్ సమావేశాల్లో పాలుపంచుకునే నిమిత్తం బుధవారం ఢిల్లీకి వెళ్లిన హరీశ్ రావు మర్యాదపూర్వకంగానే సీతారామన్‌తో భేటీ అయినట్లు సమాచారం. ఈ భేటీలో తెలంగాణకు చెందిన అంశాలేమీ కూడా ప్రస్తావనకు రాలేదని సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపపేణా తెలంగాణ చెల్లించిన మొత్తం.. రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణకు కేంద్రం […]
TELANGANA
తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు హైకోర్టు లో చుక్కెదురు
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కు హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలంటూ కొప్పుల ఈశ్వర్ చేసుకున్న విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు నేడు తోసిపుచ్చింది. అసలేం జరిగిందంటే… కొప్పుల ఈశ్వర్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ పోటీ చేశారు. ఇందులో కొప్పుల ఈశ్వర్ విజేతగా […]
ఖైరతాబాద్‌లో ఈ సారి 50 అడుగుల మట్టి వినాయకుడు
ఈ ఏడాది ఖైరతాబాద్‌లో ఆవిష్కరించనున్న గణేశుడి ప్రతిమకు సంబంధించిన నమూనాను ఖైతరాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ సోమవారం విడుదల చేసింది. ఈ దఫా 50 అడుగుల ఎత్తుతో రూపొందించనున్న ఖైరతాబాద్ వినాయకుడు పూర్తిగా మట్టితోనే నిర్మితం కానున్నాడు. ఇప్పటిదాకా ఏర్పాటైన వినాయక ప్రతిమలన్నీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో రూపొందినవే. అయితే తొలిసారి ఖైరతాబాద్ గణేశుడు పూర్తిగా మట్టితోనే రూపొందనున్నాడు. మట్టి గణపతుల వినియోగాన్ని ప్రోత్సహించాలన్న ప్రభుత్వ పిలుపుతోనే ఈ దఫా మట్టి వినాయకుడి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు […]
ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆస్తుల వివరాలను వెల్లడించాలి …. తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
ప్రభుత్వం తమ ఉపాధ్యాయులకు సంబంధించి శనివారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇకపై ఏటా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా స్థిర, చరాస్తులకు సంబంధించి క్రయ విక్రయాల కోసం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని కూడా ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు శనివారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
టాలీవుడ్ లో సినీ కార్మికులకు వేతనాల సంక్షోభం
సినీ కార్మికుల డిమాండ్ల అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ తెలిపారు. ఇటు సినీ కార్మికులు, అటు నిర్మాతలతో చర్చలు జరిపేందుకు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో సమన్వయ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ సమన్వయ కమిటీకి నిర్మాత దిల్ రాజు అధ్యక్షత వహిస్తున్నారు. ఇవాళ ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఇరువర్గాలతో చర్చలు మొదలయ్యాయని, ఆరోగ్యకర వాతావరణంలో సమస్యలపై చర్చిస్తున్నామని వెల్లడించారు. అన్ని అంశాలు ఓ […]
బండి సంజయ్ సెక్యూరిటీ రద్దు
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు పోలీసులు షాకిచ్చారు. ఇటీవలే ఆయనకు 1 ప్లస్ 5తో రోప్ టీమ్ ను పోలీసులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రోప్ టీమ్ తో పాటు ఎస్కార్ట్ వాహనాన్ని కూడా హైదరాబాద్ పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే, ఆయనకు పెంచిన భద్రత కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంది. ఒక్క రోజు వ్యవధిలోనే అదనపు భద్రతను పోలీసులు వాపస్ తీసుకున్నారు. మరోవైపు బండి సంజయ్ కు భద్రతను వెనక్కి […]
రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుపై సీఎంతో మాట్లాడతా: కేటీఆర్
రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో నిర్వహించిన రెడ్డి సంఘం ప్రమాణస్వీకారోత్సవానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని కులాల్లోనూ పేదవాళ్లు ఉన్నారని, రెడ్డి కులం కూడా అందుకు మినహాయింపు కాదని స్పష్టం చేశారు. రెడ్డి సామాజిక వర్గం పేరుకు అగ్రవర్ణమే అయినా, రెడ్లలోనూ పేదలు ఉన్నారని తెలిపారు. రెడ్డి సామాజిక వర్గ సంక్షేమం కోసం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. దీనిపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని […]
ఎన్ఐఏ అదుపులో మహిళా న్యాయవాది చుక్కా శిల్ప!
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఉప్పల్ చిలుకానగర్‌లోని తెలంగాణ హైకోర్టు మహిళా న్యాయవాది చుక్కా శిల్పతో పాటు మరికొందరి నివాసాల్లో గురువారం ఉదయం నుంచి ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. విశాఖపట్నంలో ఓ నర్సింగ్ విద్యార్థిని తప్పిపోయిన కేసు విషయంలో ఎన్ఐఏ శిల్పను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. శిల్ప సీఐపీ (మావోయిస్టు) అనుబంధ సంస్థ అయిన చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్)లో సభుర్యాలిగా ఉన్నారు. పార్వతీపురంలోని చైతన్య […]
సింగరేణిలో ఉద్యోగ నోటిఫికేషన్…
సింగరేణి లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో ఖాళీగా 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్2 పోస్టులను భర్తీ చేస్తామని సంస్థ ప్రకటించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 10 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ఉద్యోగాలకు డిగ్రీ చేసినవారు అర్హులు. డిగ్రీలో కంప్యూటర్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. లేదంటే డిగ్రీతో పాటు కంప్యూటర్స్ లో ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సు/ డిప్లొమా చేయాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లకు మించకూడదు. ఈ ఉద్యోగాలను […]
కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు ..
తెరాస పార్టీకి హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో భూమి కేటాయించిన వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు టీఆర్ఎస్ అధినేత హోదాలో సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలోని దాదాపుగా అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూమి కేటాయింపును సవాల్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగి మహేశ్వరరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ కార్యాలయానికి భూమి కేటాయింపును కూడా పిటిషనర్ ప్రస్తావించారు. అత్యంత ఖరీదైన భూమిని గజం […]