TECHNOLOGY WORLD

‘స్కై క్రూయిజ్’ … ప్రపంచమంతా తిరుగుతూ ఎంజాయ్​ చేయొచ్చు!

క్రూయిజ్ షిప్ తరహాలో వందల క్యాబిన్లు.. అందులోనే సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, గేమింగ్ జోన్లు, షాపింగ్ సౌకర్యాలు.. అద్దాలతో కూడిన బాల్కనీలు.. అబ్బో అనిపించేలా సౌకర్యాలు.. మరి ఇవన్నీ ఉండేది ఓ విమానంలో అయితే.. భలే చిత్రంగా ఉంది కదా. యెమెన్ కు చెందిన ప్రమేఖ సైన్స్ ఇంజనీర్ హషీమ్ అల్ ఘాయిలీ దీనిని డిజైన్ చేశారు. దీనికి సంబంధించి ఓ గ్రాఫిక్స్ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడా వీడియో నెటిజన్లను విపరీతంగా […]

WORLD

పాక్ లో ప్రతి శనివారం సెలవు ప్రభుత్వ ప్రకటన

ఇటీవలే పాకిస్థాన్ లో షాబాజ్ షరీఫ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగా, పీకల్లోతు సమస్యలు స్వాగతం పలికాయి. వాటిలో ముఖ్యమైనది దేశంలో ఇంధన కొరత. పాకిస్థాన్ లో ప్రస్తుతం కరెంటుకు తీవ్రమైన కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న విధంగానే శనివారాన్ని సెలవు దినంగా పునరుద్ధరించింది. తద్వారా విద్యుత్, ఇంధనం పెద్ద ఎత్తున ఆదా అవుతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధాని షాబాజ్ షరీఫ్ అధ్యక్షతన కేబినెట్ భేటీ సమావేశం […]

WORLD

ప్రియుడు మోసం చేశాడంటూ … వెంటాడి చంపిన యువతి

అమెరికాలో ఓ యువతి ప్రియుడు మోసం చేశాడంటూ అతడిని కిరాతకంగా అంతమొందించింది. ఇండియానాపొలిస్ లో ఈ ఘటన జరిగింది. ఆమె పేరు గైలిన్ మోరిస్. 26 ఏళ్ల గైలిన్ కొంతకాలంగా తన ప్రియుడు ఆండ్రే స్మిత్ పై కోపం పెంచుకుంది. ఇటీవల అతడు మరో స్త్రీతో కనిపించినప్పటి నుంచి భగ్గుమంటోంది. స్మిత్ తనను మోసం చేస్తున్నాడని భావించిన ఆ యువతి అతడ్ని ఈ లోకంలోనే లేకుండా చేయాలని తీవ్ర నిర్ణయం తీసుకుంది. దాంతో అతడి వస్తువులపై ఓ […]

NATIONAL WORLD

ప్రపంచ పర్యావరణ దినం … రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన

ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధాన్ని పక్కాగా అమలు చేసేలా చూడాలని అన్నిరాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జులై 1 నుంచి ఈ ఉత్పత్తులపై నిషేధం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఆయా పురపాలికల్లో వీటిపై నిషేధం అమలయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,700 పట్టణ పాలక మండళ్లు ఉండగా, 2,591 సంస్థలు ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధాన్ని […]

NATIONAL WORLD

22 మందితో టేకాఫ్ అయిన నేపాల్ విమానం మిస్సింగ్‌ – నలుగురు భారతీయులు మిస్

22 మందితో టేకాఫ్ అయిన నేపాల్ విమానం ఒక‌టి ఆదివారం గ‌ల్లంతు అయ్యింది. నేపాల్‌లోని ఫోక్రా నుంచి జామ్‌స‌న్‌కు బ‌య‌లుదేరిన తారా ఎయిర్‌లైన్స్ విమానానికి ఆదివారం ఉద‌యం 9.55 గంట‌ల‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌(ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయి. ఈ విమానంలో 19 ప్ర‌యాణికుల‌తో పాటు ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ప్ర‌యాణికుల్లో న‌లుగురు భార‌తీయులు స‌హా ముగ్గురు జ‌ప‌నీయులు ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌పై నేపాల్ అధికారులు దృష్టి సారించారు. గల్లంతైన విమానం ఆచూకీ క‌నుగొనే చ‌ర్య‌ల‌ను మొద‌లుపెట్టారు. గల్లంతు […]

NATIONAL WORLD

చైనాతో తగ్గిన భారత లావాదేవీలు …. అమెరికా తో పెరిగిం లావాదేవీలు

భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా అవతరించింది. చైనాను దాటేసి అగ్రరాజ్యం ముందంజ వేసింది. 2021–2022 ఆర్థిక సంవత్సరంలో చైనాతో పోలిస్తే అమెరికాతోనే భారత వాణిజ్య కలాపాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్–అమెరికా మధ్య 11,942 కోట్ల డాలర్ల (సుమారు రూ.9.28 లక్షల కోట్లు) వాణిజ్యం జరిగింది. అదే సమయంలో అంతకుముందు ఏడాది ఆ వాణిజ్య కలాపాల విలువ 8,051 కోట్ల డాలర్లుగానే (సుమారు రూ.6.25 లక్షల కోట్లు) ఉండేది. అమెరికాకు ఎగుమతులు 5,162 […]

TELANGANA WORLD

ముగిసిన కేటీఆర్ దావోస్ టూర్‌!… వచ్చిన పెట్టుబడులంతో తెలుసా !

పెట్టుబ‌డులు సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా ఆ రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేప‌ట్టిన‌ దావోస్ ప‌ర్య‌ట‌న ముగిసింది. దావోస్ వేదిక‌గా ఈ నెల 22 నుంచి 26 వ‌ర‌కు జ‌రిగిన వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం స‌ద‌స్సుకు కేటీఆర్ హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. గురువారంతో స‌ద‌స్సు ముగియ‌గా… శుక్ర‌వారం కూడా స్విట్జ‌ర్లాండ్ రాజ‌ధాని జ్యూరిచ్‌లో ప‌లువురు పారిశ్రామిక‌వేత్త‌ల‌ను క‌లిసిన కేటీఆర్‌… శుక్ర‌వారం సాయంత్రం త‌న దావోస్ పర్యటన ముగిసిన‌ట్లుగా ప్ర‌క‌టించారు. 5 రోజుల పాటు కొన‌సాగిన‌ దావోస్ […]

TELANGANA WORLD

వచ్చే 20 ఏళ్లలో కేటీఆరే భారత ప్రధాని: మహిళా వ్యాపారవేత్త

మంత్రి కేటీఆర్‌పై అమెరికాలోని వెంచర్ క్యాపిటలిస్ట్, మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని ప్రశంసలు కురిపించారు. అన్ని అంశాలపైనా స్పష్టమైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్న కేటీఆర్ లాంటి యువ రాజకీయ నాయకుడిని తన జీవితంలోనే ఇప్పటి వరకు చూడలేదని అన్నారు. వచ్చే 20 ఏళ్లలో కేటీఆర్ భారతదేశ ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటూ ట్వీట్ చేశారు. దావోస్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో కేటీఆర్‌ను కలిసిన మోత్వాని ఆయనతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ […]

TELANGANA WORLD

పెట్టుబ‌డుల గమ్యస్థానం తెలంగాణ‌: లండ‌న్ భేటీలో కేటీఆర్

లండన్ టూర్‌లో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆయా పారిశ్రామిక దిగ్గ‌జాల‌తో వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం వెస్ట్ మిడ్ ల్యాండ్స్ ఇండియా పార్ట‌న‌ర్‌షిప్ ప్ర‌తినిధుల‌తో ఆయ‌న భేటీ అయ్యారు. భార‌త్‌, మ‌ధ్య ప్రాచ్యం మధ్య వాణిజ్య కార్య‌క‌లాపాల వృద్ధే ల‌క్ష్యంగా వెస్ట్ మిడ్ ల్యాండ్స్ ఇండియా పార్ట‌న‌ర్‌షిప్ ప‌నిచేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ భేటీలో భాగంగా కేటీఆర్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు వ‌చ్చే ఏ సంస్థ‌కైనా గ‌మ్య‌స్థానం […]

WORLD

ఫిన్లాండ్, స్వీడన్ లకు రష్యా వార్నింగ్

నాటో చేరాలని నిర్ణయించుకున్న ఫిన్లాండ్, స్వీడన్ దేశాలపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా పెద్ద తప్పు చేస్తున్నారని హెచ్చరించింది. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ దేశాల నిర్ణయంతో మిలిటరీపరమైన ఉద్రిక్తతలు పెరుగుతాయని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల్లో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే ఆలోచన కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాము చూస్తూ ఊరుకుంటామనే భ్రమల్లో నుంచి వారు బయటకు […]