22 మందితో టేకాఫ్ అయిన నేపాల్ విమానం ఒకటి ఆదివారం గల్లంతు అయ్యింది. నేపాల్‌లోని ఫోక్రా నుంచి జామ్‌సన్‌కు బయలుదేరిన తారా ఎయిర్‌లైన్స్ విమానానికి ఆదివారం ఉదయం 9.55 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయి.
ఈ విమానంలో 19 ప్రయాణికులతో పాటు ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు సహా ముగ్గురు జపనీయులు ఉన్నారు. ఈ ఘటనపై నేపాల్ అధికారులు దృష్టి సారించారు. గల్లంతైన విమానం ఆచూకీ కనుగొనే చర్యలను మొదలుపెట్టారు. గల్లంతు అయిన విమానం ఆచూకీ కోసం నేపాల్ అధికారులు రెండు హెలికాప్టర్లను రంగంలోకి దించారు.
Nepal | Tara Air's 9 NAET twin-engine aircraft carrying 19 passengers, flying from Pokhara to Jomsom at 9:55am, has lost contact: Airport authorities
— ANI (@ANI) May 29, 2022