సీనియర్ నేత జూపల్లి ఏకంగా రెబల్స్‌కు అండగా నిలిచి.. పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటంతో గులాబీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశాన్ని ఆరా తీసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొల్లాపూర్‌లో అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు త్వరలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అక్కడికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కొల్లాపూర్‌లోని పరిస్థితులను టీఆర్‌ఎస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకొని.. ఇక్కడ పార్టీ గెలుపు కోసం ప్రతిష్టాత్మకంగా పనిచేయాలని పార్టీ నేతలను ఆదేశించినట్టు తెలుస్తోంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference