కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో ఆదివారం యువ సేవ కార్యాలయంలో డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జడ్పిటిసి సభ్యులు మాడుగుల రవీందర్ రెడ్డి, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని వచ్చే అంబేద్కర్ జయంతి లోపు గన్నేరువరం మండల కేంద్రంలో మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ సహకారంతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈకార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు న్యాత సుధాకర్, ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, తదితరులు పాల్గొన్నారు