contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి బిజెపి జిల్లా కార్యదర్శి సందవేణి మంజుల వాణి

 

కరీంనగర్ జిల్లా:  సన్నరకాలకు 2500 నుండి 3000 మద్దతుధర ప్రకటించాలని బిజెపి జిల్లా కార్యదర్శి సందవేణి మంజుల వాణి అన్నారు  అకాల వర్షాల ద్వారా కోతకు వచ్చి పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని  డిమాండ్ చేశారు తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట గ్రామంలోని  ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని గురువారం తిమ్మాపూర్ మండల బిజెపి ఆధ్వర్యంలో ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల సన్నరకాలకు ఎక్కువ చీడపీడలు,  తెగుళ్లు రావడం ద్వారా వాటిని నివారించడానికి అధిక పెట్టుబడులు పెట్టడం జరిగిందని  దీనివల్ల రైతులకు ఎక్కువగా ఆర్ధిక భారం పడిందని అన్నారు.కావున ప్రభుత్వం సన్నరకాలకు 2500 నుండి 3000 ల వరకు  మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసారు. రైతులు నష్టాలనుండి  పంటకోతలు పూర్తయ్యి వడ్లు కేంద్రాలకు వచ్చి వారం రోజులు దాటినా కూడా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నించారు.సన్నరకాలకు స్పష్టమైన మద్దతు ధర ప్రకటన చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వన్నీ డిమాండ్ చేశారు.అనంతరం జాతీయ మహిళా రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని సుమారు 10 మంది మహిళా రైతులను ఆమె శాలువాతో సన్మానించారు.మండల అధ్యక్షులు జగదీశ్వరాచారి మాట్లాడుతూ వెంటనే  కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే బాధ్యత వహించి కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేశారు.లేని యెడల రైతుల మద్దతుతో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బూట్ల శ్రీనివాస్,ఉపాధ్యక్షులు తమ్మనవేణి రాజు యాదవ్, కొయ్యడ శ్రీనివాస్, కేతిరెడ్డి సత్యనారాయణ రెడ్డి,జంగ సునీల్ రెడ్డి,వడ్లకొండ శ్రీహరి గౌడ్, కొమ్మెర రాజిరెడ్డి,కాల్వ శ్రీనివాస్,పడాల రాజశేఖర్, తమ్మనవేణి మహేష్ యాదవ్,తాళ్లపెల్లి సంపత్, గొల్లపెల్లి రమేష్,గోనెల శంకర్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అబ్దుల్ కలాం జయంతి వేడుకలు  ఘనంగా 

మాజీ రాష్ట్రపతి క్షిపణి పితామహుడు అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని రేణికుంటలో వేడుకలు నిర్వహించారు.బిజెపి సీనియర్ నాయకులు బూట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారితో పాటు మండల కార్యకర్తలు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :