గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపడు గ్రామానికి చెందిన టివి ఎంపీ న్యూస్ కి చెందిన రిపోర్టర్ యెతిరాజుల ఏడుకొండలు ఇంటికి అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్న సాంబయ్య , కూరపాటి కొండలు అనే వారు పదిమంది గుర్తు తెలియని వ్యక్తులను వెంటబెట్టుకొని రిపోర్టర్ ఏడుకొండలు ఇంట్లో లేని సమయం లో సుమారు రాత్రి పదకొండు గంటల ప్రాంతం లో వెళ్లి ఇంట్లో మహిళలు ఉన్నప్పుడు అసభ్యకర పదజాలాలు వాడి వాడి అంతు చూస్తాము ఎంతలో ఉండాలో అంతలో ఉండమని అంటూ బెదిరింపులకు పాలుపడ్డారని బాధితుడు ఏడుకొండలు ఆరోపిస్తున్నాడు . వివరాల్లోకి వెళితే పిడుగురాళ్ల చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రభుత్వ అనుమతులు లేకుండా కొందరు అక్రమంగా మట్టితవ్వకాలు చేస్తున్నారు . అక్రమ మట్టి తవ్వకాల విషయమై రిపోర్టర్ ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తున్నాడని లేనిపోని అభియోగాలు మోపి బెదిరింపులకు పాలుపడ్డారు . నాకు ఏ సంబంధం లేదని చెప్పినా వినకుండా నువ్వే చేసావని నీ పై తప్పుడు కేసులు బనాయించి నీ అంతుచూస్తామని , నువ్వు ఊర్లో ఎలా ఉంటావో చూస్తామని బెదిరింపులకు పాలుపడ్డారు . ఈ విషయం పై పిడుగురాళ్ల పోలీసులను సంప్రదించిన, జిల్లా ఎస్పీ , డిఎస్పీ కి వినతి పత్రాన్ని పోస్టల్ ద్వారా పంపి నాకు న్యాయం చేయండి అంటూ ఫోన్లు చేసినా .. ఎపి పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు . ఇక నైనా పొలిసు ఉన్నతాధికారులు స్పందించి తగు చెర్యలు తీసుకోవాలని బాధితుడు ఏడుకొండలు కోరుతున్నాడు.