భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అజ్ఞాత దళ సభ్యుడు యాకన్నను పట్టుకున్న కోమరారం ఎస్సై కె.శ్రీధర్. ఇల్లందు డిఎస్పీ రవీందర్ చెప్పిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో కోమరారం ఎస్సై కె. శ్రీధర్ తన సిబ్బందితో కలసి పోచారం గ్రామ శివారున గల పెద్దగుట్ట వద్ద ND1 పార్టీ రాయల వర్గం అజ్ఞాత దళ సభ్యుడైన మైలా యాకయ్య@యాకన్నను అదుపులోకి తీసుకున్నారు. యాకయ్య 2008 వ సంవత్సరం నుండి ND1 అజ్ఞాతదళంలో పనిచేస్తున్నట్లు విచారణలో తేలిందని డిఎస్పీ రవీందర్ తెలిపారు. MSR కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన కాంట్రాక్టరును అధిక మొత్తంలో డబ్బులు కోసం బెదిరించగా, దానికి సదరు కాంట్రాక్టర్ నిరాకరించినందుకు గాను ఆదే కంపెనీలో పనిచేసే గుమాస్తాను కిడ్నాప్ చేసేందుకు తమ దళాన్ని కొంచెం దూరంలో ఉంచి రెక్కీ నిర్వహించడానికి వచ్చిన యాకన్నను పక్కా సమాచారంతో పట్టుకున్న ఎస్సై శ్రీధర్, సిబ్బందిని డిఎస్పీ రవీందర్ అభినందించారు. పట్టుబడిన దళ సభ్యుడు యాకన్న వద్దనుండి(10) 8mm రౌండ్లను స్వాదీనం చేసుకోవడం జరిగిందని తెలియజేసారు. ఇతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టునకు తరలించడం జరుగుతుందని డిఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండాల సిఐ శ్రీనివాస్, కోమరారం ఎస్సై శ్రీధర్, గుండాల ఎస్సై రమేష్ లు పాల్గోన్నారు.