అనంతపురంలో టీడీపీ నేతల భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. మాజీ సైనికుల పేరిట నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి టీడీపీ నేతలు భూ అక్రమాలకు పాల్పడ్డారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఈ భూ బాగోతం రాచానపల్లి, ఇటుకలపల్లి, కురుగుంట గ్రామాల్లో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు.
మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయులపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ మేరకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమాలపై అనంతపురం ఆర్డీవో మధుసూదన్ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో రూ.100 కోట్ల విలువైన 40 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని స్వాహా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.