contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అనంత నాగ్‌లో ఎన్‌కౌంటర్… ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లా, వఘామా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నెల 26న వీరు జరిపిన కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ జవాన్ శ్యామల్ కుమార్‌తోపాటు ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. వఘామా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న జమ్మూకశ్మీర్‌కు చెందిన రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) జవాన్లు ఈ ఉదయం గాలింపు చర్యలు చేపట్టారు. భద్రతా దళాల రాకను గమనించిన ఉగ్రవాదులు వెంటనే వారిపైకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. కాగా, ఈ నెలలో ఇప్పటి వరకు 14 ఎన్‌కౌంటర్లు జరగ్గా 36 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే, ఈ ఏడాది ఇప్పటి వరకు 116 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :