contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అన్నపూర్ణ రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతా : ముఖ్య మంత్రి కేసీఆర్

 

శాసనసభ్యులు రసమయి బాలకిషన్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మానకొండూర్ నియోజకవర్గంలో త్వరలో పర్యటిస్తానని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు సిరిసిల్లలో జరిగిన పర్యటనలో ప్రకటించారు. 

  •  తెలంగాణా రాష్ట్ర సాధనలో ఎనక ముందు సూసుడు ఏంది రాజన్న ఓరాజన్న…ఎత్తుర తెలంగాణా జెండా రాజన్న ఓ రాజన్న…పాటను మా రసమయి పాడి ప్రజల్లో చైతన్యం తెచ్చారని కేసీఆర్ గుర్తు చేశారు.

  •  మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలం అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్ ను త్వరలో పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. గుట్టల మధ్యన నదీ పాయతో, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం కలిగి ఉందన్నారు. 

  •  ఇక్కడ సుమారు 243 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఈ భూమిని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయడానికి వెంటనే టూరిజం శాఖకు అప్పగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. 

  •  అన్నపూర్ణ రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తానని ప్రకటించిన శుభ సంధర్బంగా కేసీఆర్ గారికి మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ గారు కృతజ్ఞతలు తెలిపారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :