కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన రాపోలు కనకయ్య వయస్సు 50 సంవత్సరాలు అనే రైతు గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు పోలీసుల కథనం మేరకు కనకయ్య వ్యవసాయం పని చేసుకుంటూ జీవించేవాడు అయితే యాసంగిలో పంట సరిగా పండక మరియు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు అయితే గురువారం కనకయ్య ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు లేని సమయంలో ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న కనకయ్యను కుమారుడు చూసి వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు మృతునికి ఇద్దరు కుమారులు భార్య దేవవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు