గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి ఖాసీంపెట్, పారు వెల్ల, గన్నేరువరం గ్రామాలలో మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి తో కలిసి సోమవారం విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు గుండ్లపల్లి గ్రామంలో వారసంత భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు ఖాసీంపెట్ గ్రామంలో కాలేశ్వర జలాలతో చెరువులు నింపడానికి తీసిన ఉప కాలువలో భూములు కోల్పోయిన 11 మంది రైతులకు చెక్కులను అందజేశారు రైతుల కల్లాల నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం పారువెల్ల గ్రామంలో జరిగిన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మండల కేంద్రంలో రైతుల కల్లాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఉప కాలువ భూనిర్వాసితులు 18 మంది రైతులకు చెక్కులు పంపిణీ చేశారు తాసిల్దార్ కార్యాలయంలో హరితహారం లో భాగంగా మొక్కలు నాటారు మండల కేంద్రానికి చెందిన రైతు రాపోల్ కనకయ్య ఇటీవల మృతి చెందగా మృతుని భార్యకు రైతుబంధు చెక్కును ఎమ్మెల్యే అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు యువకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు