కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం ఉదయం ఎస్సై ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద యువజన సభ్యులతో కలిసి యోగా శిబిరం నిర్వహించారు ఎస్సై తిరుపతి మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని జరుగుతున్న అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఈరోజు యోగా శిక్షణ శిబిరంలో పాల్గొనడం జరిగినది తెలిపారు యువజన సభ్యులతో కలిసి పోలీసుల అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఘనంగా నివాళులు అర్పించారు ఈకార్యక్రమంలో యువజన అధ్యక్షుడు గూడూరి సురేష్, సభ్యులు రాము,శ్రీను,తిరుపతి తదితరులు ఉన్నారు