దేశ సరిహద్దులో భద్రతా విధులు నిర్వర్తించే జవాన్లకు వాతావరణంతో ఎంతో ముప్పు ఉంటుంది. తాజాగా, అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నట్టుండి సంభవించిన హిమపాతంతో ఏడుగురు జవాన్లు గల్లంతయ్యారు.
రాష్ట్రంలోని కమెంగ్ సెక్టార్ లో ఈ ఘటన జరిగింది. పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తున్న సైనికులు హిమపాతం బారినపడ్డారు. ఇప్పుడు వారికోసం భారీగా గాలింపు చేపట్టారు. ఏడుగురు జవాన్ల ఆచూకీ కోసం నిపుణుల బృందాన్ని ఘటనాస్థలికి తరలించారు. ఇటీవల కాలంలో ఇక్కడ తీవ్రస్థాయిలో మంచు కురుస్తోందని సైనికాధికారులు తెలిపారు. కమెంగ్ సెక్టార్లో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు వెల్లడించారు