కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో బుధవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి దేవాలయం లోకి చొరబడి గల్ల పెట్టను దొంగిలించి డబ్బులు తీసుకొని మార్గమధ్యంలో గల్లా పెట్టెను పడేసి వెళ్ళాడు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్టు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసువారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.