ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. కోవిడ్ నివారణ చర్యలు, ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలు, సంపూర్ణ గృహహక్కులు, ఉపాధిహామీ, సుస్థిరాభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. రబీలో పంట ఉత్పత్తుల సేకరణపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే..
►పీఆర్సీ అమలు సహా, ఉద్యోగులకోసం కొన్ని ప్రకటనలు చేశాం
►కోవిడ్ కారణంగా మరణించిన ఫ్రంట్‌లైన్ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు ఇవ్వడంపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం
►కారుణ్య నియామకాలు చేయమని చెప్పాం. యుద్ధ ప్రాతిపదికన వారికి కారుణ్య నియామకాలు ఇవ్వాలి
►గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీలను వినియోగించుకోవాలి
►ఇతర విభాగాల్లో ఉద్యోగాలంటే ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అలాంటి సమస్యలు లేకుండా యుద్ద ప్రాతిపదికన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇవ్వాలి
►జూన్ 30లోగా కారుణ్య నియామకాలు చేయాలి
►అన్ని విభాగాలూ దీనిపై దృష్టిపెట్టాలి
►ముందుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న పోస్టులను ప్రాధాన్యతగా తీసుకుని కారుణ్య నియామకాలు చేయాలి
►ఇందులో ఆలస్యానికి తావు ఉండకూడదు
►జగనన్న స్మార్ట్‌టౌన్ షిప్స్‌లో 10శాతం స్థలాలను, 20 శాతం రిబేటుపై కేటాయించాం
►ఎంఐజీ లే అవుట్స్‌లో వీరికి స్థలాలు ఇవ్వాలి
►వారికి స్థలాలు కేటాయించేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలి
►స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను రిజిస్ట్రేషన్ చేయాలి. దీనివల్ల డిమాండ్ తెలుస్తుంది
►మార్చి 5లోగా స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను రిజిస్ట్రేషన్‌చేయాలి
►ఉద్యోగులే కాకుండా.. స్థలాలు కోరుతున్నవారి పేర్లను కూడా వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి
►డిమాండ్‌ను బట్టి.. వెంటనే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది
►స్థల సేకరణకు వీలు ఉంటుంది
►సేకరించిన స్థలంలో 5శాతం స్థలాలను పెన్షనర్లకు రిజర్వ్ చేయాలి
►అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలి
►గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్‌చేయాలి
►జూన్ 30 నాటికి ఇది ఈ ప్రక్రియ పూర్తి కావాలి
►జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలి
►మిగిలిపోయిన 25శాతం ఉద్యోగులు ప్రొబేషన్ పరీక్షలను పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలి
►మార్చి మొదటి వారంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు చెప్పారు
►వారికి అవసరమైన శిక్షణ, సబ్జెక్టుపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు చెప్తున్నాం
►అలాగే ఉద్యోగుల సర్వీసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం
►ఉద్యోగులకు మంచి జరగాలని సర్వీసును పెంచాం. దీనికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలి.