కుమ్మర సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆకారపు మోహన్ కు ఎమ్మెల్సీ ఇవ్వాలి
– జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు
సిద్దిపేట జిల్లా : ఆగస్టు26, గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో రాజు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు గడిచిన భారత దేశంలో కుమ్మర కులస్తులు రాజకీయ పదవులకు ఆమడ దూరంలో ఉన్నారు. కుమ్మర కులస్తులకు కుండలు పని చేసుకోవడం జీవనాధారం ఎంతో మంది పాలకులు మారిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నాయని ఇప్పటి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు సాగని దిశలో కుమ్మరి కులస్తులు ఉంటున్నారని ఈసారి ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో కుమ్మర కులస్తుల రాష్ట్ర వ్యవస్థాప అధ్యక్షుడైనా ఆకారపు మోహన్ కు ఎమ్మెల్సీ గా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బంగారు తెలంగాణలో మమ్ములను కూడా భాగస్వామ్యులను చేయాలని తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమంలో కుమ్మరులది అత్యంత కీలకమైన పాత్ర పోషించామని ,తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 18లక్షల సమస్యల సాధన ద్యేయంగా ఉద్యమ నాయకుడు ఆకారపు మోహన్ 2007 సంవత్సరంలో తెలంగాణ కుమ్మర్ల సంఘం ఏర్పాటు చేసి కుమ్మరుల సమస్యల సాధన కోసం నిరంతరం కేసీఆర్ అడుగుజాడల్లో కుమ్మర కులస్తులు అందరిని పోరాటంలో భాగస్వామ్యం చేసి నేడు కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ఎలాంటి పదవులు ఆశించ కుండా అహర్నిశలు టీఆరెస్ పార్టీ కోసం కుమ్మరుల ,బీసీల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న టీఆరెస్ మాజీ కార్యదర్శి ,బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గా ఉన్న ఆకారపు కు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి,మంత్రి వర్యులు కేటీఆర్ కి జాతీయ బీసీ సంక్షేమ సంఘం పక్షాన కోరుతున్నామని పిడిశెట్టి రాజు పేర్కొన్నారు.