కరీంనగర్ జిల్లా: నాణ్యమైన ఎరువులు , విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలని ఏవో కిరణ్మయి పేర్కొన్నారు గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం , గుండ్లపల్లి,ఖాసీంపెట్, గన్నేరువరం గ్రామాల్లోని పలు విత్తనాలు ,ఎరువుల దుకాణాలను ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు,ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం చే గుర్తింపు పొందిన ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు , డిసిఎంఎస్ కేంద్రాల్లో విత్తనాలు , ఎరువులు కొనుగోలు చేయాలని అన్నారు .సబ్సిడీ ద్వారా స్ప్రింకలు , డ్రిప్పు పరికరాకల కోసం రైతులు ఆన్ లైన్ లో ఆప్లై చేసుకోవాలని సూచించారు ,వీరి వెంట వ్యవసాయ అధికారులు ఉన్నారు.