contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆనందయ్యకు మద్దతుగా జగపతిబాబు

 కరోనా  వైరస్ కు నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య ఇస్తున్న నాటు మందు ఇప్పుడు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ మందు ఆయుర్వేదం కిందకు వస్తుందా? రాదా? అనే విషయంలో మాత్రం ప్రభుత్వం, వైద్యాధికారులు డైలమాలో ఉన్నారు. మరోవైపు, పెద్ద సంఖ్యలో జనాలు, కరోనా రోగులు మాత్రం ఆ నాటు మందును నమ్మే పరిస్థితిలో ఉన్నారు. తర్వాత ఏం జరిగినా పర్వాలేదు… ముందైతే ఆ మందును వేసుకుందామనే యోచనలో ఎందరో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆనందయ్యకు ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు మద్దతుగా నిలిచారు.

ఆనందయ్యను చూస్తుంటే తల్లి ప్రకృతి మనల్ని రక్షించడానికి ఆయన రూపంలో వచ్చిందనిపిస్తోందని జగపతిబాబు అన్నారు. ఆయన మందుకు అధికారిక అనుమతులు రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆయన మందు ఈ ప్రపంచాన్ని కాపాడాలని… ఆ విధంగా భగవంతుడు ఆయనను ఆశీర్వదించాలని అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :