కరీంనగర్ జిల్లా: అనాధ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన మానవ అక్రమ రవాణా నియంత్రణ కోసం కొనసాగిన్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో అన్ని స్థాయిలకు చెందిన పోలీసులు భాగ్యస్వాములు కావాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి అన్నారు పోలీసులు బాలలకు విముక్తి కల్పించే చర్యల్లో నూతనోత్సాహంతో పని చేయాలని పిలుపునిచ్చారు
ఆపరేషన్ స్మైల్ -7లో భాగంగా బిక్షాటన చేసే, వీధి బాలలు, తప్పి పోయిన వారిని, మధ్యలో బడి మానేసి తల్లిదండ్రులతో కలిసి పనిచేస్తూ వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారిని కూడా గుర్తించాలని చెప్పారు ప్రతి పోలీస్ నుండి ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలను కొనసాగించాలని ఆదేశించారు ఎక్కువ సంఖ్యలో బాలల విముక్తి కోసం కమిషనరేట్ వ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన పోలీసు అధికారులతో కలిసి 05 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు ఇప్పటివరకు కమిషనరేట్ వ్యాప్తంగా 66 మంది బాలలను గుర్తించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ( సి డబ్ల్యూ సి) కి అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు
బాలకార్మికులతో పనులు చేయించుకుంటున్న వారి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని కోరారు అనాధ, బాల కార్మిక వ్యవస్థ మానవ అక్రమ రవాణా నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని చెప్పారు