పెద్దపల్లి జిల్లా ధర్మారం నర్సింహులపల్లె గ్రామంలో గురువారం ఉదయం కరెంట్ షాక్కు గురై ఆరు గేదెలు మృత్యువాత పడగా చెందగా విషయం తెలియగానే హుటాహుటిన సంఘటన స్థలాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు సందర్శించారు.
గేదెల విద్యుత్ తీగలు తెగి పడడంతో అవి మృత్యువాత పడ్డాయి.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింహులపల్లె గ్రామంలో విద్యుత్ షాక్కు గురై ఆరు పాడి గేదెలు చనిపోయాయి. గేదెలు మేతకు వెళ్ల క్రమంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంలో పశువులకు విద్యుత్ తీగల తెగి గేదెల పై పడడంతో అక్కడికక్కడే మరణించాయి.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సంఘటన చాలా బాధాకరం విద్యుత్ లైన్ కట్ కావడం వల్ల ఆ దారి నుండి వస్తున్న ఆరు పాడి గేదెలు మృత్యువాత పడడం జరిగింది. ఇదివరకే లైన్ కట్ కావడం లైన్ మెన్ నిర్లక్ష్యం వల్ల ఈ సంఘటన జరిగింది అని గ్రామస్తులు తెలపడం జరిగింది. లైన్ మెన్ సస్పెండ్ చేయాలని కలెక్టర్ కి ఆదేశించడం జరిగింది.
ఇలాంటి సమయంలో అధికారులు బాధ్యత లేకుండా పని చేస్తున్న వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ సందర్భంగా కలెక్టర్, సంబంధింత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా ఈ రోజు గేదెలను చనిపోయి ఉపాధి కోల్పోయిన వారికి తక్షణమే సాహాయం కింద చర్యలు తీసుకోవాలని, గేదెలను ఇప్పించడం అలాగే విద్యుత్ షాక్ తో మరణించడం వల్ల ఒక్కోక్కరికి 40 వేలు రూపాయలు అందించడం జరుగుతుంది. తప్పకుండా బాధితులను ఆదుకుంటామన్నారు.