కరీంనగర్ చొప్పదండి : దేశ సేవలో తరిస్తూనే చాలా మందికి సహాయం అందిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కి చెందిన జైయహో జనతా జవాన్ సెర్వింగ్ సోల్జర్స్ ఇటీవల కొలిమికుంట గ్రామానికి చెందిన అమనగంటి లచ్చయ్య అనే వృద్ధ రైతు ప్రమాదవశాత్తు బావి లో పడి మరణించారు అని తెలుసుకొని తక్షణ సహాయం కింద లీవ్ లో ఉన్న వాళ్ళు కొలిమికుంట గ్రామానికి చేరుకొని ఈరోజు లచ్చయ్య గారి పెద్దకర్మ సందర్బంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కి తక్షణ సహాయం కింద 25000 ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపాయలు చెక్ డొనేషన్ రూపంలో అందించి ఉదారత చాటుకున్నారు. ఈ కార్యక్రమం లో తిరుపతి రెడ్డి – కరీంనగర్ , శ్రవణ్ కుమార్ – కరీంనగర్ , జెమినీ సతీష్ – చొప్పదండి , గంగయ్య – నర్సింగాపూర్ , తదితరులు పాల్గొన్నారు.