కర్నూల్ జిల్లా దేవనకొండ కు చెందిన ఆర్మీ జవానుని పోలీసులు అతి దారుణంగా కొట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది , కానీ ఈ నాటివరకు ఎస్సై , ఇద్దరు కానిస్టేబుళ్ల మీద పోలీసు ఉన్నతికారులు ఏ విధమైనటువంటి చెర్యలు తీసుకోలేదు . బాధిత జవాను లక్ష్మన్న….. పత్తికొండ రురల్ సిఐ కృష్ణయ్య ఆఫీసుకు కేసు పెట్టడానికి వెళితే కేసు తీసుకోకుండా… . ఫోన్ చేసినా సమాధానం చెప్పకుండా …తప్పించుకు తిరుగుతున్నాడు .. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తను చూసి కొందరు ఆర్మీ జవానులు లక్ష్మన్న దగ్గరకు వచ్చి పరామర్శించి ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళితే రేపు రా … మాపు రా అని గత నాలుగు రోజులుగా జవాన్ లక్ష్మన్నను మానసిఖంగా హింసిస్తున్నారు , జిల్లా ఎస్పీ కూడా ఈ విషయం పై స్పందించకుండా నిర్లక్షయంగా వ్యవహరిస్తున్నారు .
కొందరు జవానులు , ప్రజలు సియం జగన్ కి ట్విట్టర్ ద్వారా దాడికి పాల్పడిన పోలీసుల పై చెర్యలు తీసుకోవాలని కోరుతున్నారు , అయినా రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయం పై స్పందించడం లేదు , గొప్ప గొప్ప న్యూస్ చానెల్స్ ఈ న్యూస్ పై స్పందించక పోవడం గమనించదగ్గ విషయమైంది , ఎందుకు ఇలా జరిగింది అని అధికారులను అడిగితె రాత్రియంబళ్లు డ్యూటీ చేసి అలసిపోయారు అందుకే ఆలా అయిందేమో అని బాగా మాట్లాడుతున్నారు . మరి దేశ సరి హద్దులో రేయింబళ్లు , గాలికి వానకి అడుగడుగునా చావు ఉందని తెలిసి పోరాడున్న జవాను ది కష్టం కాదా ? బార్డర్ లో జవాను అనే వాడు లేకపోతె … ఈ రాజకీయం , పోలీసు ఇదంతా ఉంటుందా ? ఒక్క సారి ఆలోచించాలి ? ఒక్క సారి మన జవానులు ఒక గంట కళ్ళు మూసుకుని వదిలేస్తే మన దేశం పరిస్థితి ఏంటి ? మనమందరం ఒక్కసారి ప్రశ్నించుకుందాం !!!
ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి సైనికుడి పై దాడికి పాల్పడిన ఎస్సై మారుతి , కానిస్టేబుళ్లు అశోక్ , మంజునాథ్ ల పై చెర్యలు తీసుకోవాలని ఆర్మీ జవానులు కోరుతున్నారు