contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ)లో ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

 

భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ).. అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobsవివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 2000

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ (ఏసీఐవో)–గ్రేడ్‌–2/ఎగ్జిక్యూటివ్‌

కేటగిరీల వారీగా ఖాళీలు: అన్‌రిజర్వ్‌డ్‌–989, ఈడబ్ల్యూ ఎస్‌–113,ఓబీసీ –417, ఎస్సీ–360, ఎస్టీ–121.

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్, తత్సమాన అర్హత ఉండాలి.

వయసు: 18–27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష(ఆన్‌లైన్‌), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. టైర్‌1(ఆబ్జెక్టివ్‌ పరీక్ష), టైర్‌–2(డిస్క్రిప్టివ్‌ పరీక్ష), టైర్‌–3 (ఇంటర్వ్యూ)లో ప్రతిభ ఆధారంగా పోస్టులకు తుది ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌; ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కాకినాడ,కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: జనవరి 9, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.mha.gov.in/

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :