contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (రిలీజియస్ టీచర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

 ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (రిలీజియస్ టీచర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆర్‌ఆర్‌టీ 91, 92, 93, 94, 95 కోర్సుల ద్వారా ఈ నియామక ప్రక్రియను ఇండి యన్ ఆర్మీ చేపడుతుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో తగిన నైపుణ్యం కలిగి ఉం డాలి. పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 9వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 194

పోస్టు- ఖాళీల సంఖ్య: 

పండిట్-171 :

Aర్హత : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ(ఏ గ్రూప్ వారైనా) ఉత్తీర్ణతతో పాటు అభ్యర్థులు సంస్కృతంలో ఆచార్య అర్హతను కలిగి ఉండాలి.

 పండిట్ (గూర్ఖా)- గూర్ఖా రెజిమెంట్-09 :

Aర్హత: ఈ పోస్టులకు ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతో పాటు హిందూ అభ్యర్థులు సంస్కృతంలో ఆచార్య అర్హతను కలిగి ఉండాలి. 

గంథి -05 :

Aర్హత: ఈ పోస్టులకు ఏదేని విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు అభ్యర్థులకు పంజాబీలో గ్యానీ అర్హత కలిగి ఉండాలి.

మౌల్వీ(సున్నీ) -05 :

Aర్హత : ఈ పోస్టులకు ఏదేని డిగ్రీతోపాటు ముస్లిం అభ్యర్థులకు అరబిక్‌లో మౌల్వీ అలీం/ ఉర్దూలో అదిబ్ అలీం అర్హతను కలిగి ఉండాలి.

 మౌల్వి(షియా ) లద్దాఖ్ స్కౌట్స్ -01 :

Aర్హత: ఈ పోస్టులకు ఏదేని డిగ్రీతోపాటు ముస్లిం అభ్యర్థులకు అరబిక్‌లో మౌల్వీ అలీం/ఉర్దూలో అదిబ్ అలీం అర్హతను కలిగి ఉండాలి. లద్దాఖ్ ప్రాంతానికి చెందిన షియాలు మాత్రవే ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి.

 పాడ్రే -02 :

Aర్హత: ఈ పోస్టులకు ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు స్థానిక బిషప్‌గా ఆమోదం పొంది.. ప్రస్తుతం ఆ పనిలో కొనసాగుతూ ఉండాలి.

 బోధ్ సన్యాసి(మహాయాన) లద్దాఖ్ స్కౌట్స్ -01:

అర్హత: ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీతోపాటు బోధ్ సన్యాసిగా గుర్తింపు పొంది, కాన్పా/లోపాన్/రబ్‌జాంలో పీహెచ్‌డీ సర్టిఫికేట్ పొందిన వారై ఉండాలి.

వయసు: సివిలియన్, ఇన్ సర్వీస్ అభ్యర్థులకు సంబంధించి వయసు 01.10.2021 నాటికి 25-34 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే.. అక్టోబర్ 01,1987- సెప్టెంబర్ 30, 1996 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ స్టాండర్డ్ అండ్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్షా విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : ఫిబ్రవరి 9, 2021.

పరీక్ష తేదీ : జూన్ 27, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.joinindianarmy.nic.in

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :