contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఇండియన్‌ ఆర్మీ… టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (132–టీజీసీ)ల్లో ప్రవేశాలు

 

ఇండియన్‌ ఆర్మీ… టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (132–టీజీసీ)ల్లో ప్రవేశానికి 2020–21 విద్యా సంవత్సరానికిగాను అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 40(సివిల్‌–10, ఆర్కిటెక్చర్‌–01, మెకానికల్‌–03,ఎలక్ట్రికల్‌ / ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌–04, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ టెక్నా లజీ–09, ఈసీఈ–06, ఏరోనాటికల్‌/ ఏవియా నిక్స్‌–02, ఏరోస్పేస్‌–01, న్యూక్లియర్‌ టెక్నాల జీ–01, ఆటోమొబైల్‌–01, లేజర్‌ టెక్నాలజీ–01, ఇండస్ట్రియల్‌ /మ్యానుఫ్యాక్చరింగ్‌–01.

వయోపరిమితి: 2021 జనవరి 1 నాటికి 20 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బీఈ/బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తుకు అర్హులే. పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: అభ్యర్థులను రెండు దశలలో ఎంపికచేస్తారు. ముందుగా ఇంజనీరింగ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా జాబితా తయారుచేసి.. ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీలో49 వారాల పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు లెఫ్ట్‌నెంట్‌ హోదా లో ఆర్మీలో ఉద్యోగం సొంతమవుతుంది. శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టయిఫండ్‌గా అందిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 26, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి: www.joinindianarmy.nic.in

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :