కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చాకలివానిపల్లి గ్రామ పంచాయతీ జూనియర్ కార్యదర్శి ఇటీవల కరీంనగర్ లో రోడ్డు ప్రమాదంలో తూముల రాజేందర్ మృతి చెందగా ఆదివారం జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, ఎంపీఓలు నరసింహారెడ్డి, జగన్మోహన్ రెడ్డి లతో కలిసి మానకొండూరు మండలం ఊటూర్ గ్రామానికి వెళ్లి రాజేందర్ సతీమణి వనిత ను కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని కలెక్టర్ చొరవతో రూ:1,00,000/-చెక్కు అందజేశారు.