ఇటీవల కరీంనగర్ పట్టణంలోని ఆటోనగర్ లో జరిగిన మర్డర్ లో మరణించిన ఇరుకుల్ల నర్సయ్య కుటుంబ సభ్యులను ఈరోజు తిమ్మాపూర్ మండలం జూగుండ్ల గ్రామంలో ఇరుకుల్ల విజయ చిన్న కుమారులను బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ పరామర్శించారు నర్సయ్య కుటుంబానికి పోలీసు యంత్రాంగం ఆర్థిక సహాయం చేయడం అభినందనీయం అన్నారు వారు మాట్లాడుతూ ఈ కుటుంబం చాలా నిరుపేద కుటుంబంలో ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారని ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాల ఆదుకోవాలని ఈ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ మరియు భార్యకు ఏదైనా ఒక ఉద్యోగం పిల్లలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునేందుకు సీటు మంజూరు ఇప్పించాలి స్వచ్ఛంద సంస్థలు రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఈ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండాలని కొనియాడారు ఈకార్యక్రమంలో యూత్ నాయకులు కొంకటి అనిల్,బోయిని శ్రీనివాస్ పురం రాములు తదితరులు పాల్గొన్నారు