contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఈటెల రాజేందర్ అవినీతి అక్రమ భూ దంధాలపై కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రెస్ మీట్

  

ఈటెల రాజేందర్ అవినీతి అక్రమ భూ దంధాలపై బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారు, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పాడి కౌశిక్ రెడ్డి గారు

 • ఈటల రాజేందర్ గారు అతనిపై అవినీతి ఆరోపణలు రాగానే నిన్న రాత్రి ప్రెస్ మీట్ పెట్టి నేను సత్యవంతుడను మచ్చలేని నాయకుడిని అని చెప్పుకున్నారు

 • నేను కష్టపడి ఆస్తులు సంపాదించుకున్న అని చెప్తున్న ఈటల రాజేందర్ 2004 నీకు ఉన్న ఆస్తులు ఎన్ని ఇప్పుడు ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించావ్ పూర్తిగా బహిర్గతం చేయాలి

 • నీవు నిజంగా పౌల్ట్రీ వ్యాపారం ద్వారా ఆస్తులు సంపాదిస్తే ఒకేసారి 200ఎకరాల భూమి ఎలా వచ్చింది నీవే స్వయంగా గత నెలలో నేను ఒక ఎకరం అమ్మితే ఒక ఎలక్షన్ కొట్లాడుతా అలాంటివి 200 ఎకరాలు ఉన్నాయి అని చెప్పింది నిజం కాదా

 • మొన్న 200ఎకరాలు ఉంది అని చెప్పిన ఈటల రాజేందర్ నీ ఎన్నికల అఫిడవిట్లో కేవలం నీ పేరు మీద నీ కుటుంబ సభ్యుల మీద నీవు పేరుకొన్న భూమి 69 ఎకరాలు మరి ఎన్నికలప్పుడు లేని 200ఎకరాల భూమి ఇప్పుడు ఎలా వచ్చింది

 • నిన్న మీడియాతో మాట్లాడుతూ నా మీద సెట్టింగ్ జడ్జి తో విచారణ జరుపండి అని కోరడం సంతోషం కానీ నీవు మంత్రిగా ఉండి నీ మీద విచారణ జరిపితే నీవు విచారణ అధికారులను ప్రభావితం చేసే అధికారం ఉంది కాబట్టి నీవే స్వయంగా నీ పూర్తి స్థాయి మంత్రి పదవికి రాజీనామా చేసి విచారణ చేయమని కోరండి

 •  అంతేకాకుండా హుజురాబాద్ నియోజకవర్గంలో అవినీతి ఆరోపణలు మచ్చ లేని నాయకుడిని నా మీద ఒక్క అవినీతి ఆరోపణ నిరూపించిన రాజకీయాల నుండి తప్పుకుంటా అన్నావు  కదా నీ అవినీతి ఆరోపణలు నేను ఆధారాలతో బయటపెడ్తున్న నీవు నిజంగా నిన్న చెప్పిన మాటకు కట్టుబడి రాజకీయాల నుండి తప్పుకోవాలి

 • హుజురాబాద్ నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు ఎటువంటి పనులు చేయాలన్న నీ అనుచరుడు నీ స్వంత మండలం కమలాపూర్ మండలం కన్నూరు గ్రామానికి చెందిన సంపత్ రావుకి కమిషన్ ఇచ్చిన తర్వాతనే పనులు చేయానిస్తుంది నిజం కాదా

 • ఇదే సంపత్ రావు అనే వ్యక్తి నీ బినామీగా ప్రస్తుతం కమలాపూర్ మండలంలో సింగిల్ విండో చైర్మన్ గా ఉండి నీ అండదండలతో అదే మండలానికి చెందిన రంగా రావు అనే ఒక పెద్ద మనిషికి పిల్లలు లేకపోతే అతని ఆస్థి మొత్తం రాసి ఇవ్వాలి అని అతనిపై దాడి చేసి కార్ ధ్వంసం చేసింది నిజం కాదా

 • నీ స్వంత గ్రామం కమలాపూర్లో 23మంది దళితుల ఇండ్లు కులగొట్టించి అందులో నీ అనుచరులు ఇండ్లు కడుతుంటే వాటిపై జిల్లా కలెక్టర్ గారికి నేను పిర్యాదు చేస్తే అడ్డుకున్నది నిజం కాదా

 • నీ స్వంత గ్రామంలో నీ పార్టీ మాజీ సర్పంచ్ సమ్మయ్య, వైస్ ఎంపీపీ దశరథం, మాజీ ఎంపీటీసీ అశోక్ అభివృద్ధి పనుల కోసం వేసిన శిలాఫలకం మీద వారి పేర్లు లేవని దాన్ని పగలగోడితే నేను వేసిన శిలాఫలకం పగులగొడుతారా అని వారి మీద కక్ష సాధించి వారిని పది రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టి ఒక నక్స లైట్లను కొట్టినట్టు కొట్టించింది నిజం కదా

 • నీ అండదండలతో నీ స్వంత మండల తెరాస పార్టీ అధ్యక్షుడు మాట్ల రమేష్ 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దున్నుకుంటున్నది నిజం కాదా

 • 2018 ఎన్నికల ముందు ఈటల రాజేందర్ అవినీతి అక్రమాలు చేసాడు అని ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన తిప్పరపు సంపత్ నీ అక్రమాల మీద ఒక కర పత్రం విడుదల చేస్తే అతన్ని మూడు నెలలు జైల్లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించింది నిజం కాదా

 • వీణవంక మండలానికి చెందిన కౌశిక్ రెడ్డి అనుచరుడు మాజీ ఎంపీటీసీ బాలరాజ్ గారిని 2014 జనవరి 5న ఆనాటి నీ పార్టీ సర్పంచ్ ప్రస్తుతం ఎంపీటీసీ రమేష్ బాలరాజు గారిని మర్డర్ చేస్తే అదే గ్రామానికి నీవు 2014 లో ఎన్నికల ప్రచారానికి వెళితే నీపై గ్రామస్తులు చెప్పులతో దాడి చేసింది నిజం కాదా ఆ తర్వాత నీవు మంత్రి అయినాక ఆ మర్డర్ కేసు లేకుండా చేసింది నిజం కాదా

 • ఆ బాలరాజ్ పై మర్డర్ చేసిన తర్వాత నీవు గ్రామానికి వెళితే నీపై గ్రామస్థులు దాడి చేసారని అదే గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి అనే ఒక సింగల్ విండో చైర్మన్ పై కక్ష సాధించి అతన్ని పదవి నుండి తొలగించింది నిజం కాదా వీటన్నిటికీ సమాధానం చెప్పు ఈటల రాజేందర్ గారు

 • బీసీ ముసుగులో ఉన్న దొర ఈటల రాజేందర్ గారు మంత్రి అయినాక నీకు 500 కోట్లతో RVM మెడికల్ కాలేజీ 100 కోట్లతో ఇల్లు కట్టుకోవడానికి ఎక్కడి నుండి వచ్చినాయి పైసలు

 • నీవు నిన్న మాట్లాడుతూ దొరలకు వ్యతిరేకంగా కొట్లాడిన వాడిని అని చెప్పుకున్నావ్ కాదా కానీ నీవు బీసీ ముసుగులో ఉన్న దొరవి నీవు జమున రెడ్డి గారిని ప్రేమ వివాహం చేసుకున్న నీవు నీ పిల్లలకు రెడ్డి అని పేర్లు పెట్టావ్ అంటే అది నా భార్య పెట్టుకుంది అన్నావ్ నీవు రెడ్డి అని పేర్లు పెట్టుకున్న నేను బీసీ ముదిరాజ్ బిడ్డని అంటున్నావు కదా మరి నీవు నిజంగా బీసీ బిడ్డవు అయితే నీవు ఒక బీసీ కోడలిని ఒక బీసీ అల్లుడిని తెచ్చుకోకుండా ఏరి కోరి రెడ్డి కోడలు, రెడ్డి అల్లుడుని తెచ్చుకొని బీసీలను అవమానిచ్చింది నిజం కాదా

 • నిజంగా ఈటల రాజేందర్ బీసీ నాయకుడు ఐతే హుజురాబాద్ నియోజకవర్గనికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు ప్రవీణ్ యాదవ్ హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తే అతన్ని తప్పుడు రికార్డు నమోదు చేయమని హాస్పిటల్ సూపరింటెండెంట్ చెపితే ప్రవీణ్ యాదవ్ చేయనందుకు అతన్ని ఉద్యోగం నుండి తొలగిస్తే హై కోర్ట్ నుండి ఆర్డర్స్ తెచ్చుకున్న అతన్ని ఉద్యోగంలోకి తీసుకోకపోతే అతడు సూపరింటెండెంట్ణి ప్రశ్నిస్తే అదే ప్రవీణ్ యాదవ్ పోలీస్ల చేత ఇష్టం వచ్చినట్టు నువ్వు కొట్టిస్తే మనస్థాపంతో చనిపోయినది నిజం కాదా అతనికి సూపరింటెండెంట్ ణి ప్రశ్నిస్తే నాపై అక్రమ కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టింది నిజం కాదా నీవు నిజంగా బీసీ బిడ్డవు ఐతే ప్రవీణ్ యాదవ్ కు అండగా నిలువలిసింది పోయి అతన్నే పోలీస్ కొట్టించి సూపరింటెండెంట్ ప్రవీణ్ రెడ్డి కి అండగా నిలిచింది నీవు కాదా

 •  ఈటల రాజేందర్ పై వచ్చిన అవినీతి ఆరోపణలుపై పూర్తి స్థాయి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి అని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం

అంతే కాకుండా అవినీతి ఆరోపణలు వచ్చిన తెరాస పార్టీకి చెందిన ప్రతి మంత్రి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :