contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

ఈరోజు సాయంత్రం 4 గంట‌ల నుండి ఆదివారం 4 గంట‌ల వరకు 2 ఎమ్మెల్సీ స్థానాల్లో మ‌ద్యం దుకాణాలు బంద్‌!

 

తెలంగాణ లో  జ‌ర‌గ‌నున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక‌ల ప్ర‌చారానికి నేటితో తెర‌ప‌డనున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ రోజు సాయంత్రం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో మ‌ద్యం దుకాణాలు మూతపడనున్నాయి.ఈ మేరకు తెలంగాణ‌ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీచేశారు.  వైన్‌షాపులు, బార్లు, కల్లు దుకాణాలతో పాటు క్లబ్బులు మ‌ళ్లీ ఎల్లుండి సాయంత్రం 4 గంట‌ల త‌ర్వాతే తెరుచుకుంటాయి. ఈ నెల 14న మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంతో పాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి ఎన్నిక‌లకు ఈ రోజు సాయంత్రం 4 గంటల వ‌రకే ప్ర‌చారం చేసుకునేందుకు వీలుంది.ఈ రెండు స్థానాల‌ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే ఈ నెల 17న కూడా మ‌ద్యం దుకాణాల‌ను మూసి వేయాల్సిందే. ఈ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక‌ల‌ను రాజ‌కీయ పార్టీలు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంటున్నాయి. స్వ‌తంత్ర అభ్య‌ర్థులు కూడా గ‌ట్టిపోటీనిచ్చే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :